తిరుపతి : ఆంధ్ర ప్రదేశ్ లో కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చేస్తున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడు పల్లెలో సాఫ్ట్వేర్ ఉద్యోగి సజీవ దహనం కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటివరకు నాగరాజు చనిపోవడానికి తమ్ముడి వివాహేతర సంబంధం కారణమని అనుకుంటున్నారు. అయితే దీంతో పాటు ఆర్థిక కారణాలు కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయని తెలుస్తోంది. నాగరాజు హత్యకేసులో నిందితుడైన రిపుంజయ, మృతుడు నాగరాజు.. హత్యకు ముందు రోజు కూడా ఫోన్లో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆడియో లీక్ అయింది. నాగరాజును చంపాలన్న మర్డర్ మోటివ్ వెనుక, అక్రమ సంబంధంతో పాటు, నగదు లావాదేవీలు కూడా ఉన్నట్లుగా దీంతో వెలుగు చూసింది.