ఈ విద్యార్థులకూ రెండ్రోజులు సెలవులే..
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతోంది... ఇందులో భాగంగానే ఇవాళ (నవంబర్ 5, గురువారం) ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇచ్చారు.
అయితే ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు, పలితాల వెల్లడి నవంబర్ 7న అంటే ఈ శనివారం జరగనుంది. ఓట్ల కౌంటింగ్ సెంటర్లను కూడా ప్రభుత్వ విద్యాసంస్థలు లేదంటే కార్యాలయాల్లో ఏర్పాటుచేస్తారు... కాబట్టి ఈరోజు కూడా కొందరికి సెలవు ఉంటుంది. ఇలా దీపావళికి ముందురోజు ఏపీలో కొందరు విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు వస్తోంది... వీళ్లు శని, ఆదివారం రెండ్రోజులు దీపావళి వేడుకలను జరుపుకోవచ్చు.
గమనిక : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో దీపావళికి ముందురోజు అంటే నవంబర్ 7 (శనివారం) సెలవు అందరికీ వర్తించదు. కొందరికి మాత్రమే సెలవు ఉంటుంది. కాబట్టి స్కూల్ నుండి సమాచారం ఉంటేనే సెలవుగా పరిగణించాలి.