Pawan Kalyan Cars Collection : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లగ్జరీ కాార్లను ఇష్టపడతారని ఆయనవద్ద ఉన్న కార్ కలెక్షన్ ను బట్టి అర్థమవుతోంది. ఇంతకూ ఆయనవద్ద ఏఏ కార్లు, మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
Pawan Kalyan Cars Collection : పవన్ కళ్యాణ్... ఈ పేరు తెలియని తెలుగోళ్లు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా హీరోగా ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్... రాజకీయ నాయకుడిగా ఆయనకున్న కార్యకర్తల బలం మరెవరికీ లేదు. ఇక ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, వివిధ శాఖల మంత్రిగా ఆయన పాలనావిధానం, తీసుకునే నిర్ణయాలు మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా చేరువచేసింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చేత ప్రశంసలు పొందే స్థాయికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ అభిమానించేవారు ఆయన గురించి ప్రతి విషయం తెలుసుకోవాలని భావిస్తుంటారు. ఆయన సినిమాలు, సాధించిన కలెక్షన్ల గురించే కాదు రాజకీయ నిర్ణయాల గురించి కూడా తెలుసుకుని గొప్పగా చెప్పుకుంటారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బైటకు వస్తుంటారు... ఇలా అతడి లగ్జరీ కార్ల కలెక్షన్స్ గురించి బైటపడింది. ఏపీ డిప్యూటీ సీఎం వద్ద ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసుకుందాం.
25
పవన్ కల్యాణ్ కార్ కలెక్షన్...
సినీ హీరోగా ఉండగా పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన వివరాలే బైటకు వచ్చేవి... ప్రజా జీవితంలోకి వచ్చాక ఆయన జీవితం తెరిచిన పుస్తకంగా మారింది. ఆయన ఆదాయం, భూములు, ఇళ్లు, అప్పులు, కుటుంబంవద్ద ఉన్న బంగారం, భార్యాపిల్లల పేరిట ఉన్న ఆస్తులు అన్నీ ప్రజలకు తెలిసిపోయాయి. ఆయన ఎన్నికల అఫిడవిట్ లో ఈ వివరాలన్నీ ఉంటాయి.
అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ ను పరిశీలిస్తే ఓ ఆసక్తికర విషయం అర్ధమవుతుంది... ఆయన కార్లంటే ఎంత ఇష్టమోనని. సాధారణంగా ఆయన లగ్జరీ జీవితాన్ని ఇష్టపడరు... కానీ కార్ల విషయంలో ఇందుకు మినహాయింపు ఉన్నట్లు కనిపిస్తుంది. చాలా సాధారణంగా కనిపించే పవన్ కళ్యాణ్ వద్ద కోట్ల విలువచేసే లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.
35
పవన్ కళ్యాణ్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఇవే..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద ఉన్న అత్యంత లగ్జరీ కారు రేంజ్ రోవర్ స్పోర్ట్స్... దీని విలువ 5 కోట్ల 47 లక్షల రూపాయలకు పైనే ఉంటుంది. దీన్ని ఆయన 2022 లో కొనుగోలు చేశారు. ఆయనవద్ద ఉన్న మరో ఖరీదైన కారు బెంజ్ మేబ్యాక్... దీని విలువ 2 కోట్ల 42 లక్షల రూపాయలకు పైనే... దీన్ని 2021 లో కొనుగోలు చేశారు.
పవన్ కళ్యాణ్ వద్ద కోటి రూపాయల కంటే విలువైన మరో రెండు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అందులో ఒకటి టయోటా ల్యాండ్ క్రూజర్... దీని విలువ 2 కోట్ల 53 లక్షలకు పైనే. 2022 లో కొనుగోలు చేశారు. ఆయనవద్ద టయోటా వెల్ఫైర్ కారు కూడా ఉంది... ఇది కోటీ 11 లక్షల రూపాయల విలువుంటుంది.. 2022 దీన్ని కొనుగోలు చేశారు.
పవన్ కల్యాణ్ వద్ద ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నా ఆయన మాత్రం సాధారణ కార్లలోనే ప్రయాణిస్తుంటారు. ఆయన మొదట మహింద్రా స్కార్పియో వాడేవారు... 2014 లో ఆయనవద్ద 13 లక్షల రూపాయల విలువచేసే ఓ స్కార్పియో ఉండేది. అయితే 2022 లో 23 లక్షల 49 వేల విలువైన మహింద్రా స్కార్పియో S11 కొనుగోలు చేశారు.
పవన్ కళ్యాణ్ పేరిట టాటా యోధా పికప్ ట్రక్ (రూ.9 లక్షల విలువ) కూడా ఉంది. దీన్ని 2021 లో కొనుగోలు చేశారు. ఇక రూ.71 లక్షల విలువచేసే జీప్ వ్రాంగ్లర్, రూ.72 లక్షల విలువైన బెంజ్-ఆర్ క్లాస్ 350 కూడా పవన్ కళ్యాణ్ పేరిట ఉంది.
55
పవన్ కల్యాణ్ వద్ద ఉన్న ఏకైక బైక్ ఇదే..
పవన్ కళ్యాణ్ వద్ద ఓ లగ్జరీ బైక్ కూడా ఉంది. 2010 లోనే ఆయన హర్లీ డేవిడ్సన్ బైక్ కొనుగోలు చేశారు. దీనివిలువ 32 లక్షల రూపాయలకు పైనే. అయితే ఈ బైక్ ను ఆయన మొదట్లో వాడేవారు... కానీ సినిమాలు, రాజకీయాల్లో బిజీ అయ్యాక దీన్ని పక్కనబెట్టేశారు. సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఆయన బైక్ నడపడాన్ని అభిమానులు చూసుండరు.