వన్యప్రాణుల సంరక్షణపై డిప్యూటీ సీఎం ప్రత్యేక దృష్టి.. అటవీ అధికారుల జోలికి వస్తే ఇక అంతే సంగతులు

Published : Jul 31, 2024, 08:16 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో వన్యప్రాణుల వేట, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇటీవల అటవీ అధికారులపై జరిగిన దాడిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  

PREV
13
వన్యప్రాణుల సంరక్షణపై డిప్యూటీ సీఎం ప్రత్యేక దృష్టి.. అటవీ అధికారుల జోలికి వస్తే ఇక అంతే సంగతులు
Deputy CM Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌లో వన్య ప్రాణులను, జంతువులను వేటాడి, అక్రమ రవాణా చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లాలోని విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో వన్య ప్రాణి అలుగు (పంగోలియన్)ను వేటాడి అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకొనేటప్పుడు అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై ఆయన ఆరా తీశారు.

23
Deputy CM Pawan Kalyan Emphasizes Strict Action Against Wildlife Poaching

వన్య ప్రాణులను, అటవీ సంపదకు నష్టం కలిగించినా, అక్రమ రవాణా చేసినా, ఉద్యోగులపై దాడులు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. అరణ్య భవన్‌లో నిర్వహించిన గ్లోబల్ టైగర్స్‌ డే కార్యక్రమంలో తను చదువుకొనే రోజుల్లో ఒంగోలులో అలుగును కొందరు వ్యక్తులు కొట్టి చంపిన విషయాన్ని ప్రస్తావించానని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు. 

33
Deputy CM Pawan Kalyan Emphasizes Strict Action Against Attacks on Forest Officials

విజయపురి సౌత్ అధికారులపై దాడి ఘటనపై పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడారు. ఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. ఉద్యోగులపై దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంత పరిసరాల్లోని ప్రజలకు అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories