పవన్ కల్యాణ్ తో జెన్నిఫర్ భేటీ... ఇంతకీ ఎవరీమె?

First Published | Jul 30, 2024, 11:07 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అమెరికాలోని తెలుగోళ్ల సంక్షేమంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే తన బిజీ షెడ్యూల్ లోనూ జెన్నిఫర్ తో భేటీ అయ్యారు.ఇంతకూ ఎవరీ జెన్నిఫర్..? 

Pawan Kalyan

Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటీ అయ్యారు. మర్యాదపూర్వంగానే అమెరికా కాన్సుల్ బృందం పవన్ కల్యాణ్ ను కలిసినట్లు జనసేన పార్టీ అధికారిక ఎక్స్ ద్వారా ప్రకటించింది. 
 

Pawan Kalyan

తనను కలిసిన జెన్నిఫర్ తో పాటు ఆమె బృందానికి పవన్ సత్కరించారు.  జెన్నిఫర్ కు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం, జ్ఞాపిక అందజేసారు. మిగతావారికి పర్యావరణ హితమైన బ్యాగులను అందించారు డిప్యూటీ సీఎం.
 

Latest Videos


Pawan Kalyan

ఈ సందర్భంగా అమెరికా కాన్సుల్ బృందంతో పలు అంశాలపై పవన్ కల్యాణ్ చర్చించారు. ముఖ్యంగా ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికాలో వుంటున్న భారతీయులు మరీముఖ్యంగా తెలుగువారి సంక్షేమంపై చర్చించారు. అమెరికా అభివృద్ధిలో తెలుగు ప్రజల పాత్రపై పవన్, జెన్నిఫర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు సమాచారం. 
 

Pawan Kalyan

 భారత్, అమెరికా దేశాల మధ్య  ద్వైపాక్షిక సంబంధాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల హడావిడి నేపథ్యంలో దీనిపైనా పవన్, జెన్నిఫర్ మధ్య సంబాషణ జరిగినట్లు తెలుస్తోంది. 

Pawan Kalyan

ఇక ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లేందుకు తెలుగు విద్యార్థులు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఆ దేశ వీసా విధానం వల్ల చాలామంది అమెరికా ఆశలు తీరడంలేదు. కాబట్టి సులభతరమైన వీసా విధానాన్ని తీసుకురావాలని...తద్వారా తమ విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందని పవన్ కోరారు. ఇందుకు అమెరికా కాన్సుల్ బృందం కూడా సానుకూలంగా స్పందించింది. 
 

Pawan Kalyan

పవన్ కల్యాణ్ తో పాటు మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ లను కూడా అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ కలిసారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్ పాలకులతో అమెరికా కాన్సుల్ బృందం భేటీ అయి అనేక అంశాలపై చర్చించారు. 
 

click me!