Sugali Preethi: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ముందుకి సుగాలీ ప్రీతి కేసు.. ఈసారి ఏమవుతుంది?

Published : Jul 31, 2024, 07:56 AM IST

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను సుగాలీ ప్రీతి తల్లి పార్వతి కలిశారు. తన కుమార్తె కేసు పురోగతిపై ఆవేదన వ్యక్తం చేశారు.  

PREV
13
Sugali Preethi: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ముందుకి సుగాలీ ప్రీతి కేసు.. ఈసారి ఏమవుతుంది?
Sugali Preethi's Mother Seeks Justice

సుగాలీ ప్రీతి తల్లి పార్వతి డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను కలిశారు. తన బిడ్డకు న్యాయం జరగలేదని కన్నీటి పర్యంతం అయ్యారు. గత ప్రభుత్వం ఈ కేసును ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

23
Sugali Preethi's Mother met Deputy CM Pawan Kalyan

‘‘మా అమ్మాయి సుగాలీ ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సీబీఐ వరకూ కేసు వెళ్లలేదు’’ అని సుగాలీ ప్రీతి తల్లి పార్వతి కన్నీటి పర్యంతమవుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి వినతి పత్రం అందించారు. మంగళగిరిలో తన కుటుంబంతో పాటు పవన్ కళ్యాణ్‌ని కలిసి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశారు.

33
Sugali Preethi's Mother met Deputy CM Pawan Kalyan

తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడ బిడ్డకు జరగకుండా చూడాలని సుగాలీ ప్రీతి తల్లి పార్వతి కోరారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సుగాలీ ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి పార్వతి పోరాడుతూనే ఉన్నారన్నారు. ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories