ఓసీ కులాల్లోని పేద మహిళల కోసం ఈబీసీ నేస్తం అమలు చేస్తున్నామన్నారు. 4.39 లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు రూ.658 కోట్లు ఇవాళ నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద ఇప్పటివరకూ రూ. 1257 కోట్లు ఇచ్చామన్నారు. దాదాపు 4 లక్షలమంది లబ్ధిదారులు రెండో దఫా ఈ నిధులు అందుకుంటున్నారన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని సీఎం పేర్కొన్నారు.
మహిళలు ఆర్థికంగా నిలబడాలని, సామాజికంగా, రాజకీయపరంగా, సాధికారత సాధించాలని అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. అమ్మ ఒడి దగ్గర నుంచి 30 లక్షల ఇళ్లపట్టాల వరకూ చాలా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వం అని సీఎం పేర్కొన్నారు.