ఇంత చేస్తున్నా... కాబట్టి వైసిపి అభ్యర్థిని గెలిపించండి: తిరుపతిలో ఇంటింటికి జగన్ లేఖ

First Published Apr 8, 2021, 4:22 PM IST

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని కుటుంబాలకు ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ స్వయంగా లేఖలు రాశారు.

అమరావతి: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని కుటుంబాలకు ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ స్వయంగా లేఖలు రాశారు. 22 నెలల పరిపాలనా కాలంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన మేలును ఈ లేఖలో వివరించారు.
undefined
క్యాంపు కార్యాలయంలో జగన్‌ తొలి లేఖపై సంతకం చేశారు. కుటుంబంలోని సోదరుడు లేదా అక్కచెల్లెమ్మకు ఈ లేఖను నేరుగా రాశారు.
undefined
వైయస్సార్‌ సున్నావడ్డీ, వైయస్సార్‌ ఆసరా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, వైయస్సార్‌చేయూత, వైయస్సార్‌ పింఛన్‌ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ధిని ఈ లేఖల్లో పేర్కొన్నారు.
undefined
గ్రామాలు, నగరాలు, వైద్యం, విద్యారంగాలు, వ్యవసాయం, రైతులు, అక్కచెల్లెమ్మలు, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, అభివృద్ధి పనులు తదితర అంశాలను జగన్‌ ఈలేఖల్లో ప్రస్తావించారు.
undefined
ఈలేఖలో ప్రతిపక్ష పార్టీలమీద ఎలాంటి విమర్శలు చేయకుండా 22 నెలల పరిపాలనలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, ప్రభుత్వం దార్శినికతను, వాగ్దానాలను నిలబెట్టుకున్న విధానాన్ని తెలియజేశారు.
undefined
జగన్‌ రాసిన ఉత్తరం ఇంతకుముందు రాజకీయ సంస్కృతికంటే భిన్నంగా సాగింది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటువేసి వైయస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్‌ గురుమూర్తిని గెలిపించాలంటూ ఆయా కుటుంబాలను లేఖలద్వారా అభ్యర్థించారు. ఈ లేఖలను వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ఆయా కుటుంబాలకు అందిస్తుంది.
undefined
click me!