వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో నిజాలు నిగ్గు తేలాల్సిందే: విజయమ్మ బహిరంగ లేఖ

First Published | Apr 5, 2021, 7:12 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో నిగ్గు తేలాల్సిందేనని వైఎస్ విజయమ్మ చెప్పారు. ఈ విషయంలో తనతో పాటు సీఎం జగన్, షర్మిల మాట కూడ ఇదేనని ఆమె తేల్చి చెప్పారు.
 

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో నిగ్గు తేలాల్సిందేనని వైఎస్ విజయమ్మ చెప్పారు. ఈ విషయంలో తనతో పాటు సీఎం జగన్, షర్మిల మాట కూడ ఇదేనని ఆమె తేల్చి చెప్పారు.
undefined
సోమవారంనాడు వైఎస్ విజయమ్మ ఐదు పేజీల లేఖను ఆమె మీడియాకు విడుదల చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతారెడ్డి ఈ నెల 2వ తేదీన సీబీఐ అధికారులను కలిసిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ఆవేదనను వ్యక్తం చేశారు.
undefined

Latest Videos


ఈ హత్య కేసుపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ స్పందించారు. దీంతో ఇవాళ వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు.మూడు రోజులుగా ఒక వర్గం మీడియాలో వస్తోన్న వ్యాఖ్యలు, విమర్శల నేపథ్యంలో తాను ఈ లేఖ రాసినట్టుగా ఆమె వివరించారు.
undefined
2009 సెప్టెంబర్ 2న డాక్టర్ వైఎస్ఆర్ మరణించిన తర్వాత తమ కుటుంబం ఏయే కారణాలతో ఎవరెవరికి లక్ష్యంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు.
undefined
ఇటీవల ఏపీ పంచాయితీ ఎన్నికలు, మున్పిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలో వైసీపీ ఘన విజయం సాధించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. దీంతో చంద్రబాబు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నుండి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించారని ఆమె ప్రస్తావించారు.
undefined
చిన్న గీతను పెద్దది చేయడానికి సాధ్యం కాదు.. అయితే ఓ వర్గం మీడియా కొన్ని పార్టీలు ఒకే మాట ఒకే బాటగా అబద్దాలు చెప్పడం ప్రారంభించారని ఆమె ఆరోపించారు. 2019 మార్చిలో వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారన్నది కచ్చితంగా నిగ్గు తేలాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.
undefined
ఈ హత్య జరిగిన రెండు నెలల వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. ఈ హత్యపై అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డి పాత్రపై అనేక అనుమానాలున్నాయని ఆమె ఆరోపించారు. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారన్నారు.
undefined
సీబీఐ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని తెలిసి కూడ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై తనపక్కనే స్టేజీపై ఆదినారాయణరెడ్డిని పెట్టుకొని జగన్ పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.
undefined
వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారు ఎంతటివారైనా చట్టం ముందు నిలబెట్టి శిక్షించాల్సిందేనని సునీత డిమాండ్. మా కుటుంబంలో ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడ అదేనని విజయమ్మ తేల్చి చెప్పారు.సునీతకు తమ అందరి మద్దతు ఉంటుందన్నారు.
undefined
రాష్ట్రానికి సీఎంగా ఉన్న జగన్ స్వయంగా తనకు సంబంధించిన కేసైనా తన బాబాయి హత్య కేసైనా కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేస్తున్న సమయంలో ఏం చేయగరలని ఆమె ప్రశ్నించారు.
undefined
వైఎస్ఆర్ మరణం సహజమా, లేక హత్యా అన్ని అనుమానం ఆ రోజు అందరిలో ఉంది. మాకూ ఆ అనుమానం ఉందన్నారు. కానీ అప్పుడైనా మేం ఏం చేయగలిగామని ఆయన ప్రశ్నించారు.
undefined
ఓ పత్రికాధిపతి ఈ హత్య కేసు విషయమై తన పత్రికలో రాసిన కథనాలపై ఆమె మండిపడ్డారు. వయస్సులో తన కంటే పెద్దవారిని అన్నా అని జగన్ పిలుస్తారని ఆమె చెప్పారు. ప్రజా సంకల్పయాత్ర, ఓదార్పు యాత్రల్లో జగన్ మనస్తత్వం ప్రజలకు తెలుసునని ఆమె తెలిపారు.
undefined
తెలంగాణలో తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని షర్మిలమ్మ నమ్ముతుందన్నారు. తెలంగాణ ప్రజలతో తనకు అనుబంధాన్ని దేవుడు ఆనాడే రాశాడని ఆమె నమ్ముతోందన్నారు. ఈ కారణంగానే షర్మిల తెలంగాణలో ముందడుగు వేస్తున్నట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు.
undefined
కానీ, తన బిడ్డల మధ్య విభేదాలు తీసుకురావాలన్న దిగజారుడు ప్రయత్నాలను ఎల్లో మీడియా రాతల్లో కన్పిస్తోందన్నారు.ఇది ఏనాడూ కూడ జరగదని ఆమె స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రంతో సంబంధాలు కోరుకొంటున్న నేపథ్యంలో తెలంగాణలో వైసీపీని నడపడం సాధ్యం కాదని జగన్ నిర్ణయం తీసుకొన్నందున ఈ ప్రాంతపు కోడలిగా తాను ప్రజా సేవలో ఉండాలని షర్మిల నిర్ణయం తీసుకొందని విజయమ్మ వివరించారు.
undefined
click me!