ప్రియారామన్‌తో రోజాకు చెక్: ఏపీలో బీజేపీ వ్యూహం ఇదీ...

First Published Jul 24, 2019, 12:34 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సినీ నటి ప్రియా రామన్ బీజేపీలోకి రప్పించేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. బుధవారం నాడు ప్రియా రామన్ ఈ విషయమై స్పష్టత ఇవ్వనుంది.

ప్రముఖ నటి ప్రియా రామన్‌ బీజేపీలోకి రప్పించేందుకు కాషాయ నేతలు ప్రయత్నాలను ప్రారంభించారు. తిరుపతి వేదికగా రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రియారామన్ ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
undefined
సినిమాలకు దూరంగా ఉన్న ప్రియా రామన్ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. ప్రియా రామన్‌ను బీజేపీలో చేర్పించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
undefined
బీజేపీ నేతలు కూడ ఈ విషయమై ప్రియారామన్ తో చర్చించినట్టుగా చెబతున్నారు. తిరుపతిలో బుధవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రియారామన్ బీజేపీలో చేరే విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
undefined
తెలుగు సినిమాల్లో నటించిన ప్రియా రామన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. పార్టీని బలోపేతం చేసేందుకు సినీ గ్లామర్‌ను కూడ ఉపయోగించుకోవాలని కాషాయదళం భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
undefined
చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ స్థానం నుండి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా సినీ నటి రోజా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా వాణీ విశ్వనాథ్, దివ్యవాణిలు పోటీ చేస్తారని గతంలో ప్రచారం సాగింది.
undefined
అయితే మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి జగదీష్ కు చంద్రబాబుకు టిక్కెట్టు కేటాయించారు. ఈ స్థానంలో రోజా రెండోసారి విజయం సాధించారు.
undefined
దక్షిణాది భాషల్లోని పలు చిత్రాల్లో ప్రియారామన్ నటించారు. దీంతో ప్రియారామన్ సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రియా రామన్ బుధవారం నాడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఆమె బీజేపీలో ఎప్పుడు చేరుతారనే విషయమై కూడ స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
undefined
ప్రియా రామన్ బీజేపీలో చేరితే చిత్తూరు జిల్లా నగరి నుండి రోజాపై పోటీకి దిగుతారా అనే చర్చ కూడ లేకపోలేదు. ఎన్నికలకు ఇంకా ఐదేళ్ల సమయం ఉంది. అయితే అప్పుడు నెలకొనే పరిస్థితుల ఆధారంగా ప్రియారామన్ ఎక్కడి నుండి పోటీ చేయాలనే విషయమై నాయకత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
undefined
మరో వైపు ప్రియా రామన్ బీజేపీలో ఇంకా చేరలేదు. బీజేపీలో చేరిన తర్వాత ఆమెను ఎక్కడి నుండి బరిలోకి దింపాలనే విషయమై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంటుందని కాషాయవర్గాలు చెబుతున్నాయి.
undefined
నగరిలో రెండో దపా ఎమ్మెల్యేగా ఉన్న రోజా కూడ సినీ రంగం నుండి వచ్చారు. దీంతో నగరిలో ఆమెను బరిలోకి దింపొచ్చనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ ఊహగాహనాలకు ప్రియారామన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
undefined
click me!