జగన్ కు చెక్: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ దోస్తీ

First Published Jul 24, 2019, 11:05 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన సారథి పవన్ కల్యాణ్ ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ దూకుడుకు కళ్లెం వేయాలనే ఉద్దేశంతో ఆ ఇరువురు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చేతులు కలిపేందుకు వారు సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన సారథి పవన్ కల్యాణ్ ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ దూకుడుకు కళ్లెం వేయాలనే ఉద్దేశంతో ఆ ఇరువురు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చేతులు కలిపేందుకు వారు సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది.
undefined
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. త్రిముఖ పోటీని నివారించి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని ముఖాముఖి ఎదుర్కునేందుకు తగిన వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా దెబ్బ తిన్న విషయం తెలిసిందే.
undefined
తెలుగుదేశం పార్టీకి కేవలం 23 శానససభ స్థానాలు, 3 లోకసభ స్థానాలు రాగా, జనసేన ఒక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జగన్ ను ఓడించాలనే ఏకం కాక తప్పదనే అభిప్రాయానికి పవన్ కల్యాణ్, చంద్రబాబు వచ్చినట్లు చెబుతున్నారు.
undefined
నిజానికి టీడీపి, జనసేన శాసనసభ, లోకసభ జమిలి ఎన్నికల్లో ముందస్తు పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం సాగింది. అయితే, ఈ దిశగా ముందుకు సాగడానికి ఇరు పార్టీలు కూడా వెనకంజ వేశాయి. దాంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ జరిగి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్ కాంగ్రెసు బలాన్ని ఆ రెండు పార్టీలు తక్కువ అంచనా వేసుకోవడం కూడా అందుకు మరో కారణం.
undefined
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలకు చెందిన స్థానిక నేతల నుంచి పవన్ కల్యాణ్ పై, చంద్రబాబుపై ఒత్తిడి వస్తోంది. అభిప్రాయభేదాలను పక్కన పెట్టి వైసిపిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పొత్తుకు సిద్ధపడాలని వారంటున్నారు
undefined
2014 ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించినప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు. అటు జాతీయ రాజకీయాల్లో బీజేపీకి మద్దతుగా నిలిచారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.
undefined
click me!