జగన్‌ మళ్లీ జైలుకే..! లిక్కర్‌ కేసులో బుక్‌ చేసేందుకు చంద్రబాబు ప్లాన్‌

First Published | Jul 24, 2024, 8:00 PM IST

‘గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం అక్రమాలపై విచారణ జరిపిస్తాం. సమగ్ర దర్యాప్తు కోసం అవసరమైతే ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ)కి సిఫారసు చేస్తాం’ అని ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Chandrababu Pawan

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి వైసీపీని తిరుగులేని దెబ్బకొట్టారు చంద్రబాబు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ గెలుచుకున్న జగన్‌ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇక, అధికారంలోకి వచ్చాక జగన్‌ ప్రభుత్వం చేసిన తప్పులను జనం ఎదుట పెట్టే పని పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఆయా విభాగాలు, శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి, పోలవరం, సహజ వనరులు, విద్యుత్తు తదితర అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు విడుదల చేశారు. జగన్‌ హయాంలో జరిగిన భారీ అవినీతి, అక్రమాలను లెక్కలతో సహా స్పష్టంగా వెల్లడించారు. 

Chandra Babu

ఇక, ఎన్నికల్లో చెప్పినట్లు వివాదాస్పద ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు చంద్రబాబు... అలాగే, 2019 నుంచి 2024 మధ్య కాలంలో అమలు చేసిన మద్యం విధానం, లిక్కర్‌ విక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేశారు.


దోచుకోవడమే లక్ష్యంగా...

మద్యపాన నిషేధమని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్‌ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు చంద్రబాబు. వేల కోట్ల రూపాయలు దోచుకోవడమే లక్ష్యంగా మద్యం పాలసీ చేశారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో లిక్కర్‌ విషయం జగన్‌ అడుగడుగునా అక్రమాలు చేశారన్నారు. ఇష్టారీతిన మద్యం ధరలు పెంచేసి పేదలను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలో పెంచడమే కాకుండా పిచ్చిపిచ్చి బ్రాండ్లను తీసుకొచ్చి మద్యంప్రియుల జీవితాలతో ఆడుకున్నారన్నారు. 

విపరీతంగా రేట్లు పెంచేసి...

మద్యం విషయంలో గత జగన్‌ ప్రభుత్వం విచ్చలవిడిగా వ్యవహరించిందని.. లోకల్‌ నాసిరకం బ్రాండ్లను ప్రోత్సహించి ప్రాణాలతో చెలగాటమాడారన్నారు. విపరీతంగా రేట్లు పెంచేసి నగదు చెల్లింపులే అమలు చేశారని... ఆన్‌లైన్ సిస్టమ్‌ పెట్టకుండా తప్పు చేశారన్నారు. ఇలా రాష్ట్రానికి గడిచిన ఐదేళ్లలో తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధమన్న జగన్‌ లిక్కర్‌ షాపులను టీడీపీ హయాంలో ఉన్నవాటికంటే పెంచేశారన్నారు. ఎంఎన్‌సీ బ్రాండ్లను పక్కన పెట్టేసి వైసీపీ వాళ్లకి నచ్చిన బ్రాండ్లను మాత్రమే రాష్ట్రంలో అమ్మారని చెప్పారు. లిక్కర్‌ డిస్టలరీస్‌ని బలవంతంగా లాక్కొని వైసీపీ వాళ్ల మనుషులే నడిపించారని ఆరోపించారు. అది కూడా చాలా దారుణమైన చీప్‌ క్వాలిటీ మద్యం విక్రయించారన్నారు. బూమ్‌ బూమ్‌ అంటూ పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చారన్నారు. దేశమంతా దొరికే లిక్కర్‌ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్‌ దొరకకుండా చేశారని, పేమెంట్స్‌ ఆలస్యం చేసి.. ఆర్డర్లు ఇవ్వకుండా లిక్కర్‌ తయారు చేసే పెద్ద కంపెనీలు వేధించి పారిపోయే స్థితికి తీసుకొచ్చారని చెప్పారు. 

ప్రభుత్వానికి రూ.18,860 కోట్లు నష్టం

తోపుడు బండ్లపై కూడా ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ జరుగుతుంటే ఏపీలో లిక్కర్‌ షాపుల్లో మాత్రం క్యాష్‌ పేమెంట్సే చేశారని చంద్రబాబు తెలిపారు. ఇలా ఇండియన్‌ మేడ్‌ ఫారెన్‌ లిక్కర్‌, బీర్ల ద్వారా రూ.3వేల 113 కోట్ల అక్రమ వసూళ్లు చేశారని... రిటైల్‌ షాపుల ద్వారా రూ.99వేల 413 కోట్లు క్యాష్‌ వసూలు చేశారని వెల్లడించారు. ఇలా నాలుగేళ్ల పాటు (2023 వరకు) క్యాష్‌  పేమెంట్లు జరగలేదని... గడిచిన ఏడాదిలో రూ.615 కోట్లు మాత్రమే డిజిటల్‌ పేమెంట్స్‌ చేశారన్నారు. అంటే మొత్తం చెల్లింపుల్లో 0.66 మాత్రమే డిజిటల్‌ చెల్లింపులు జరిగినట్లు వివరించారు. మద్యం పాలసీని తమకి నచ్చినట్లు మార్చుకొని ప్రభుత్వానికి రూ.18,860.51 కోట్లు నష్టం చేకూర్చారని వెల్లడించారు.

సీఐడీ విచారణ

ఇలా గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం అక్రమాలపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వమే మద్యం విక్రయిస్తున్న మద్యాన్ని తక్కువ ధరకు అందించాల్సింది పోయి విపరీతంగా పెంచేశారన్నారు. ఇష్టమొచ్చినట్లు వసూళ్లు చేసి పేదల నుంచి కోట్లాది రూపాయలు దోచేశారన్నారు. ఇలాంటి భయంకరమైన తప్పులు చేసినవారు మళ్లీ చేయాలంటే భయపడేలా కఠినంగా శిక్ష వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన లిక్కర్‌ అక్రమాలపై సీఐడీతో విచారణ చేపడతామని తెలిపారు. సమగ్ర దర్యాప్తు కోసం అవసరమైతే ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ)కి సిఫారసు చేస్తామన్నారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ మేరకు ప్రకటించారు.

Latest Videos

click me!