పవన్ కల్యాణ్ చెప్పినట్లే చేద్దాం..: చంద్రబాబు మాటల్లో చాలా అర్థం దాగుంది..!!

First Published | Jul 22, 2024, 11:24 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య దూరం పెరిగిందంటూ ఇటీవల ఓ ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు ఇవాళ ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

Pawan Kalyan

Pawan Kalyan : పవన్ కల్యాణ్... తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. సినిమాల్లో పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఆయన రాజకీయాల్లో పవర్ ఫుల్ స్టార్ గా మారారు. ఓటమితో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం పార్టీ మొత్తాన్ని ఓటమన్నదే లేకుండా తీర్చిదిద్దే స్థాయికి చేరింది. 100శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించడమంటేనే మామూలు మాట కాదు... అలాంటిది మరో రెండుపార్టీల గెలుపులో కూడా పవన్ పాత్ర మరువలేనిది. ఇలా టిడిపి, జనసేన, బిజెపి కూటమిని  బంపర్ మెజారిటీ గెలిపించి అధికారంలోకి తీసుకురావడంలో పవన్ దే కీలపాత్ర. ఈ ఎన్నికల్లో పవన్ కింగ్ మేకర్ గా నిలిచారన్నది జనసైనికులు, మెగా ఫ్యాన్స్ అభిప్రాయం. 

Pawan Kalyan

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్... ఎవరి స్టైల్లో వాళ్లు పాలన సాగిస్తున్నారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో మొదలైన ఓ ప్రచారం టిడిపి, జనసేన శ్రేణుల మధ్య వివాదం సృష్టించేలా కనిపించింది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు దక్కుతున్న ప్రాధాన్యత ఏపీలో పవన్ కల్యాణ్ కు దక్కడం లేదనేది ఆ ప్రచార సారాంశం. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా భట్టి వుంటున్నారు... కానీ చంద్రబాబు మాత్రం పవన్ ను పక్కన పెడుతున్నారు... కీలకమైన సమావేశాలకు తీసుకెళ్లడం లేదంటూ ఇటీవల ఓ ప్రచారం జోరందుకుంది. 
 


Pawan Kalyan

పవన్ కల్యాణ్ ను చంద్రబాబు దూరం పెట్టడానికి కారణం కూడా ఈ ప్రచారంలో భాగమే. భవిష్యత్ లో పవన్ ఎక్కడ తన కొడుకు నారా లోకేష్ కు అడ్డు వస్తాడో అనేది చంద్రబాబు భయమట...అందువల్లే ఇప్పటినుండే పవన్ దూరం పెడుతున్నాడట. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు తర్వాత ఎవరు అంటే వినిపించేది పవన్ పేరు... అలాకాకుండా తన తర్వాత కొడుకు పేరు వినిపించాలనేది చంద్రబాబు ప్లాన్ అట. అందువల్లే పవన్ ను రాజకీయంగా ఎదగనివ్వకూడదనే దూరం పెడుతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. 

Pawan Kalyan

ఇలా చంద్రబాబు, పవన్ ల మద్య దూరం పెరిగిందంటూ జరుగుతున్న ప్రచారం టిడిపి, జనసేన శ్రేణులను గందరగోళానికి గురిచేసింది. కానీ తాజాగా చంద్రబాబు ఒకేఒక్క మాటతో ఇలాంటి ప్రచారాలన్నింటికి తెరదించారు. అదే 'పవన్  చెప్పినట్లు చేద్దాం''. 

Pawan Kalyan

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ(సోమవారం) ప్రారంభయ్యాయి. ఓటాన్ అకౌంట్ తో పాటు పలు కీలక అంశాలపై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. అయితే ఇవాళ సభలో వైసిపి గందరగోళం సృష్టించిన నేపథ్యంలో మరింత పకడ్బందీగా సభను నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు సిద్దమయ్యారు. ఈ క్రమంలో సభలో ఎలా వ్యవరించాలన్నదానిపై కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై పలు సలహాలు, సూచనలిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 

Pawan Kalyan

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో సడన్ గా పవన్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఇటీవల అన్నా క్యాంటీన్ ల మాదిరిగానే పేదల ఆకలితీర్చిన మహానుభావురాలు డొక్కా సీతమ్మ పేరిట క్యాంటిన్లను ఏర్పాటుచేయాలని పవన్ కోరారు. దీన్ని తాజా మీటింగ్ లో గుర్తుచేస్తూ ''పవన్ చెప్పినట్లే చేద్దాం...డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఏర్పాటుచేసుకుందాం'' అని చంద్రబాబు తెలిపారు. 

Pawan Kalyan

ఇలా చంద్రబాబు ఒకే ఒక్క మాటతో పవన్ కల్యాణ్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో భయటపెట్టారు. పవన్ చేసిన చిన్న రిక్వెస్ట్ ను సైతం గుర్తుపెట్టుకుని ప్రస్తావించడం వెనక తమ మధ్య ఎలాంటి దూరం లేదని... ప్రభుత్వంలో పవన్ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేసారని జనసేన నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా మరోసారి చంద్రబాబు, పవన్ ఒకేవేదికపై కనిపించి తమమధ్య దూరం లేదనే సంకేతాలను జనసేన,టిడిపి శ్రేణులకు పంపించారు. 
 

Latest Videos

click me!