జూ.ఎన్టీఆర్ పై చంద్రబాబు ముందస్తు జాగ్రత్త: అచెన్నపై మొగ్గు వెనక....

First Published Sep 5, 2020, 10:56 AM IST

చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఎవరికీ అప్పగించాలనే విషయం పై మల్లగుల్లాలు పడుతున్నారు. లోకేష్ ని ప్రస్తుతానికి రాజకీయంగా యాక్టివేట్ చేసే పనిలో బిజీగా ఉంది టీడీపీ. ఈ మధ్యకాలంలో లోకేష్ సైతం బహిరంగంగా కనబడుతున్నారు. ఆ పరిస్థితి ఒకవైపు నడిపిస్తునే.... మరో వైపు టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం టీడీపీ పై చర్చ నడుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బహుశా తెలుగుదేశం పార్టీ వ్యవహారాల గురించిఈ స్థాయిలో చర్చ జరగడం ఇదే మొదటిసారి కాబోలు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ అంతర్గత వ్యవహారం గురించి ఈ స్థాయిలో చర్చ నడుస్తుంది.
undefined
టీడీపీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. జగన్ అఖండ విరాజయం తరువాత టీడీపీ డీలా పడిపోయింది. వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు కొందరు నాయకులూ పార్టీని వీడుతుండగా... ఆర్ధిక మూలాలపై ఎదురు దెబ్బలుపడడంతో... మరికొందరు నేతలు పార్టీని వీడుతున్నారు.
undefined
పనిలో పనిగా టీడీపీ భావి నాయకత్వంపై వైసీపీ ఎక్కడలేని ప్రశ్నలను లేవనెత్తుతోంది. చాలా తెలివిగా లోకేష్ ను అనర్హుడిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని విపక్షంలో ఉన్నప్పటి నుంచే మొదలుపెట్టిన వైసీపీ అందులో సఫలీకృతమైంది అని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పైబడుతున్న వయసు దృష్ట్యా భావి నాయకుడు ఎవరు అనే ప్రశ్న మరింత తీవ్రతరమయింది.
undefined
ఈ నేపథ్యంలో చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఎవరికీ అప్పగించాలనే విషయం పై మల్లగుల్లాలు పడుతున్నారు. లోకేష్ ని ప్రస్తుతానికి రాజకీయంగా యాక్టివేట్ చేసే పనిలో బిజీగా ఉంది టీడీపీ. ఈ మధ్యకాలంలో లోకేష్ సైతం బహిరంగంగా కనబడుతున్నారు. ఆ పరిస్థితి ఒకవైపు నడిపిస్తునే.... మరో వైపు టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనిచంద్రబాబు యోచిస్తున్నారు.
undefined
ఇందుకోసం రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలన్న చర్చ ఊపందుకుంది. ఈ మధ్యకాలంలో మీడియాలో ఈ విషయమైన విస్తృతమైన చర్చ నడుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం అచ్చెన్నాయుడిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు యోచిస్తున్నారు.
undefined
వాస్తవంగా రామ్ మోహన్ నాయుడు పేరు తొలుత వినిపించినప్పటికీ... అచ్చెన్నాయుడు వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్టుగా తెలియవస్తుంది. రామ్ మోహన్ నాయుడుని చేస్తే యువతను ఆకర్షించొచ్చు అని తొలుత భావించినప్పటికీ.... ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు వైపు మొగ్గు చూపెడుతున్నట్టు తెలియవస్తుంది.
undefined
గత ఎన్నికల్లో తమకు వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీలు జారిపోయారు అనే విషయాన్నీ చంద్రబాబు గ్రహించారు. అందుకోసం వారిని తిరిగి టీడీపీ వైపుగా ఆకర్షితులను చేసే ప్రయత్నాలనుఈ మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు. అందుకోసమే బీసీలపై దాడి చేస్తుంది వైసీపీ ప్రభుత్వం అంటూ అచ్చెన్న, కోళ్లు రవీంద్ర అరెస్టుల సమయంలోవ్యాఖ్యానించింది టీడీపీ నాయకత్వం.
undefined
అందుకోసం బీసీ నేతనే టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని యోచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అచ్చెన్నాయుడే అందుకు తగిన వ్యక్తి అని చంద్రబాబు, ఇతర సీనియర్లు భావించారు. దానికి తోడు వైసీపీ టార్గెట్ చేసిందేనే ఒక సింపతీ ఫాక్టర్ తో పాటుగా.... జగన్ కి ఎదురు నిలిచాడు అనే ఇమేజ్ ఇప్పుడు అచ్చెన్నాయుడు సొంతం.
undefined
ఈ ఈక్వేషన్స్ ని బలంగా తమకు అనుకూలంగా వాడుకోవాలని అనుకుంటుంది టీడీపీ. అచ్చెన్నాయుడికి అధ్యక్ష పదవిని ఇస్తే... పోరాడుతున్నవారికి గుర్తింపును ఇస్తుంది టీడీపీ అనే ఒక విషయం కూడా బయట ప్రచారంలోకి వస్తుంది.
undefined
ఎప్పటినుండో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ఎర్రన్నాయుడి కుటుంబానికి టీడీపీ సముచేయుత స్థానం కల్పించిందని పేరుతో పాటుగా...,వైసీపీ కావాలని అచ్చెన్నాయుడిని టార్గెట్ చేస్తుంటే పార్టీ దన్నుగా నిలిచిందనే ఒక మెసేజ్ ని కూడా ఇచ్చినట్టవుతుంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వీక్ అయిన టీడీపీ అక్కడ ఇప్పుడు బలంగా పాగా వేయాలంటే అచ్చెన్నాయుడికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడమే కరెక్ట్ అనే భావనకు వచ్చినట్టు తెలుస్తుంది.
undefined
అచ్చెన్నాయుడు గనుక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ బలమైన వాయిస్ వినిపిస్తే... భవిష్యత్తులో తలపెట్టిన లోకేష్ సైకిల్ యాత్ర సందర్భంలో కూడా వైసీపీని బలంగా కౌంటర్ చేయవచ్చని చంద్రబాబు యోచిస్తున్నట్టుగా తెలియవస్తుంది. ఈ అన్ని లెక్కలను బేరీజు వేసుకున్న చంద్రబాబు అచ్చెన్నకు అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని డిసైడ్ అయ్యారట.
undefined
ఇవన్నీ పైకి కనబడుతున్న, వినబడుతున్న అంశాలయితే.... అంతర్గతంగా మాత్రం మరో విషయం దాగియున్నట్టుగా కనబడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చి పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ ఊపందుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుత పరిస్థితుల్లో అచ్చెన్నాయుడిని గనుక అధ్యక్షుడిగా చేస్తే... ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం కొద్దీ కాలంపాటయినా మరుగున పడిపోతుందని... ఈ గ్యాప్ లో ఒక్కసారి గనుక లోకేష్ సైకిల్ యాత్ర మొదలైతే.... ఇక ఆ విషయం అంతగా చర్చకు వచ్చే అవకాశం ఉండదని చంద్రబాబు ప్లాన్ వేస్తున్నట్టుగా తెలియవస్తుంది.
undefined
click me!