కడప: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజా నాయకుడినని నిరూపించుకున్నాడు. గతంలో ఓదార్పు యాత్ర పేరిట ప్రజలకు దగ్గనయిన ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన తర్వాత కూడా ప్రజాసేవను విస్మరించలేదు. ఇలా అతి సామాన్య కుటుంబంలో పుట్టిన ఓ పసిబిడ్డను తన చేతుల్లోకి తీసుకుని మరోసారి ప్రజానాయకుడినని నిరూపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి.
తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతిని పురస్కరించుకుని సీఎం జగన్ కుటుంబసమేతంగా ఇడుపులపాయలకు వచ్చారు. తండ్రి వర్ధంతి కార్యాక్రమాలన్నీ పూర్తిచేసుకున్న తర్వాత తన నియోజకర్గమయిన పులివెందుల నుండి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆయన మమేకమయిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ క్రమంలోనే తన కుమారుడికి ఆశీస్సులు అందించాలంటూ ముఖ్యమంత్రి జగన్‌ను జ్యోతి అనే మహిళ కోరింది. దీంతో ఆమె పసిబిడ్డను ఆప్యాయంగా తన చేతుల్లోని తీసుకున్నారు సీఎం జగన్. ఇలా ఆ బాబును జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి కూడా నిండుమనస్సుతో ఆశీర్వదించి ఆ తల్లి కోరికను తీర్చారు.