Published : Oct 22, 2021, 09:19 AM ISTUpdated : Oct 22, 2021, 09:21 AM IST
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం 36గంటల దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే దీక్షకు కూర్చున్న చంద్రబాబు రాత్రి అదే వేదికపై నిద్రపోయారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో పార్టీ కార్యాలయంలో ప్రారంభమైన ఈ దీక్ష 36 గంటలపాటు కొనసాగనుంది.