MGNREGA: పవన్ కళ్యాణ్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం... 21.50 కోట్ల పనిదినాలు పెంపు

First Published | Jul 31, 2024, 10:54 AM IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి 21.50 కోట్ల పనిదినాలు పెంచినట్లు ప్రకటించింది.

ఉపాధి హామీ

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ ఏడాది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది పేద కుటుంబాలకు ఉపాధి లభించనుంది.

21.50 కోట్ల ఉపాధి హామీ పనిదినాలు పెంపు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మేరకు 2024- 25 ఆర్ధిక సంవత్సరానికి  గానూ లేబర్ బడ్జెట్‌ను 21.50 కోట్ల పనిదినాలకు పెంచడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అంగీకరించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తెలిపారు. పెరిగిన పని దినాల వల్ల ఉపాధి హామీ పథకంలో పని చేసే 54 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుందని అయన చెప్పారు. 

Latest Videos


అదనపు పని దినాల మంజూరు

లేబర్ బడ్జెట్  మొదటి విడతగా 15 కోట్ల పని దినాలు మంజూరు చేసింది. ఆ పని దినాలు జూన్ నెలాఖరుకే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అదనపు పని దినాల కోసం ఈ ప్రతిపాదనలు పంపామని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనను అంగీకరించారని తెలియజేశారు. 

సత్వరమే బకాయిల విడుదల

అదే విధంగా ఇప్పటి వరకు ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన బకాయిలను సత్వరమే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించినట్లు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

click me!