వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు: అరెస్టైంది వీరే, కేసు కొలిక్కి వచ్చేనా?

First Published | Apr 16, 2023, 12:44 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో  ఇప్పటికే  పలువురిని  సీబీఐ అరెస్ట్  చేసింది.  రానున్న రోజుల్లో  మరిన్ని అరెస్టులు  జరిగే  అవకాశం లేకపోలేదు. 

వైఎస్ వివేకానందరెడ్డి

 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  సీబీఐ  దూకుడును  పెంచింది  ఈ కేసు విచారణ ఆలస్యం కావడంపై  సుప్రీంకోర్టు  ఇటీవలనే  ఆగ్రహం వ్యక్తం  చేసింది.  దీంతో  కేసు  విచారణను పూర్తి  చేయాలని  సీబీఐ భావిస్తుంది. ఈ కేసులో  కీలక సూత్రధారులను  సీబీఐ  అరెస్ట్  చేసే అవకాశం ఉందనే  ప్రచారం  సాగుతుంది.  
 

వైఎస్ వివేకానందరెడ్డి

రెండు  రోజుల వ్యవధిలో  పులివెందులకు  చెందిన  ఇద్దరిని  సీబీఐ అధికారులు  అరెస్టు  చేశారు. ఆదివారంనాడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని  సీబీఐ  అధికారులు  అరెస్ట్  చేయడం  ప్రాధాన్యత  సంతరించుకుంది.


వైఎస్ వివేకానందరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసు విచారణ  ఆలస్యం కావడంపై  ఈ ఏడాది  మార్చి 20న  సుప్రీంకోర్టు  ఆగ్రహం వ్యక్తం  చేసింది. అవసరమైతే విచారణ అధికారిని  మార్చాలని కూడా  ఉన్నత న్యాయస్థానం  సూచించింది.  

వైఎస్ వివేకానందరెడ్డి

2019  మార్చి  14వ తేదీ  రాత్రి పులివెందులలోని  తన నివాసంలో  వైఎస్ వివేకానందరెడ్డిని  దుండగులు  హత్య  చేశారు. ఈ హత్య  జరిగిన సమయంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  చంద్రబాబునాయుడు సీఎంగా  ఉన్నారు. ఈ హత్య  కేసు విచారణకు  సిట్ ను  ఏర్పాటు  చేసింది  చంద్రబాబు సర్కార్ . 2019  ఎన్నికల్లో  చంద్రబాబు  ఓటమి పాలయ్యాడు.  వైఎస్ జగన్  సీఎంగా  బాధ్యతలు  చేపట్టారు.  అయితే  ఈ కేసు విచారణకు  చంద్రబాబు  సర్కార్  నియమించిన  సిట్ స్థానంలో  మరో సి్ట్ ను  ఏర్పాటు  చేశారు.  

వైఎస్ వివేకానందరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసును  సీబీఐతో విచారించాలని  మాజీ మంత్రి  ఆదినారాయణరెడ్డి,  టీడీపీ ఎమ్మెల్సీ  బిటెక్ రవి,  వైఎస్ వివేకానందరెడ్డి  కూతురు   వైఎస్  సునీతారెడ్డి  ఏపీ  హైకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు.  ఈ పిటిషన్ పై విచారించిన  ఏపీ హైకోర్టు  సీబీఐ  విచారణకు ఆదేశాలు  జారీ చేసింది.ఈ కేసుకు సంబంధించి సిట్ ను వివరాలను  సేకరించింది సీబీఐ.  ఈ కేసును హైకోర్టు ఆదేశాల మేరకు  విచారిస్తుంది. 

వైఎస్ వివేకానందరెడ్డి

ఈ కేసును సీబీఐ విచారణ  చేపట్టిన తర్వాత  పలువురిని అరెస్ట్  చేసింది.   2021  ఆగష్టు మాసంలో  వైఎస్ వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడుు ఎర్ర గంగిరెడ్డిని  సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు.  వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో   ఉపయోగించిన  ఆయుధాల  కోసం  సీబీఐ అధికారులు  గాలింపు  చర్యలు చేపట్టారు.

వైఎస్ వివేకానందరెడ్డి

2021  ఆగస్టు 2న  ఏ2 సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 2021  సెప్టెంబర్  8న ఏ3 ఉమాశంకర్ రెడ్డిని  సీబీఐ అధికారులు   అరెస్ట్  చేశారు.  2021  నవంబర్  17న  ఏ5 దేవిరెడ్డి  శివశంకర్ రెడ్డి అరెస్ట్ చేసింది సీబీఐ. వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  గతంలో  ఆయన  వద్ద పనిచేసిన దస్తగిరి ని  సీబీఐ అదుపులోకి తీసుకుని  ప్రశ్నించారు. అయితే  ఈ కేసులో  దస్తగిరి  సీబీఐకి  అఫ్రూవర్ గా మారాడు.  2021  ఆగష్టు  30వ తేదీన దస్తగిరి ఇచ్చిన  స్టేట్ మెంట్ ను  సీబీఐ అధికారులు  ప్రొద్దుటూరు  కోర్టులో  సమర్పించారు. ఎర్ర గంగిరెడ్డి,  సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డితో  కలిసి  వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసినట్టుగా   దస్తగిరి కన్ఫెషన్ స్టేట్ మెంట్  ఇచ్చారు. 

వైఎస్ వివేకానందరెడ్డి

ఈ కేసు విచారణ  నత్తనడకన  సాగడంపై  వైఎస్ వివేకానందరెడ్డి కూతురు  వైఎస్ సునీతా రెడ్డి  సీబీఐ  అధికారులకు  ఫిర్యాదు  చేశారు.  దీంతో   కేసు దర్యాప్తులో  సీబీఐ అధికారులు  వేగం  పెంచారు. 

వైఎస్ వివేకానందరెడ్డి

ఈ నెల  14న  కడప ఎంపీ  వైఎస్  అవినాష్ రెడ్డికి  సన్నిహితుడు  గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని  సీబీఐ అరెస్ట్  చేసింది.  ఇవాళ  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని  సీబీఐ అరెస్ట్  చేసింది. 

వైఎస్ వివేకానందరెడ్డి

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని  కూడా ఈ కేసులో  సీబీఐ అధికారులు విచారించారు.  ఈ కేసులో  తనను అరెస్ట్  చేయవద్దని ఆదేశాలు  ఇవ్వాలని కడప ఎంపీ  అవినాష్ రెడ్డి దాఖలు  చేసిన  పిటిషన్ ను  తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది.  సీబీఐ విచారణ  చేసుకోవచ్చని  కూడా  ఆదేశించింది. 

వైఎస్ వివేకానందరెడ్డి

వైఎస్  వివేకానందరెడ్డి  హత్య  కేసు  విచారణను త్వరగా  పూర్తి చేయాలని  సుప్రీంకోర్టు ఆదేశించింది.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు  దర్యాప్తులో  వేగం పెంచింది సీబీఐ. అయితే  ఈ కేసు  ఎన్ని  రోజుల్లో  కొలిక్కి వస్తుందో అనే విషయమై  ఇంకా స్పష్టత లేదు. 
 

Latest Videos

click me!