బోటు ప్రమాదం ఇలా జరిగింది: ప్రత్యక్ష సాక్షి మధులత

First Published Sep 19, 2019, 5:56 PM IST

తూర్పు గోదావ రి జిల్లాలో బోటు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో గల్లంతైన వారిలో ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు.

తనను గోదావరి నదిలో నీటి నుండి బోటును పట్టుకొనే వరకు తన భర్త తనను పైకి లేపాడని తిరుపతికి చెందిన సుబ్రమణ్యం భార్య మధులత చెప్పారు. ఈ నెల 15వ తేదీన దేవీపట్నం-కచ్చలూరు వద్ద బోటు ప్రమాదాన్ని ఆమె వివరించారు.
undefined
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు వద్ద రాయల్ వశిష్ట పున్నమి బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన సుబ్రమణ్యంతో పాటు ఆయన కూతురు హాసిని మృతి చెందింది. ఈ ప్రమాదంలో సుబ్రమణ్యం భార్య మధులత ప్రాణాలతో బతికి బయటపడింది.
undefined

Latest Videos


ప్రమాదం జరగడానికి ముందు బోటు నడిపే సిబ్బంది కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని ఆమె చెప్పారు. బోటు కుదుపుకు గురైన తర్వాతే ఈ ప్రాంతం డేంజర్ జోన్ అని బోటు నడిపే వ్యక్తి తెలిపాడన్నారు.
undefined
తమకు కనీసం ఆ సమయంలో లైఫ్ జాకెట్లు వేసుకోవాలని కూడ సూచించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లైఫ్ జాకెట్లు వేసుకొంటే చాలా మంది ప్రాణాలతో బతికి బయటపడేవారని ఆమె అభిప్రాయపడ్డారు.
undefined
గోదావరి నదిలో బోటు మునిగే సమయంలో తొలుత తమ పాప హాసిని కింద పడిపోయిందన్నారు. పాప ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించినా కూడ దొరకలేదన్నారు. ఆ తర్వాత తన భర్త సుబ్రమణ్యం, ఆ తర్వాత తాను నీళ్లలో పడిపోయినట్టుగా ఆమె గుర్తు చేసుకొన్నారు.
undefined
తాను బోటును పట్టుకొనేవరకు తన భర్త సుబ్రమణ్యం తనను నీళ్ల నుండి పైకి లేపాడని ఆమె చెప్పారు. తాను బోటు పట్టుకొన్న తర్వాతే ఆయన తనను వదిలేశాడని ఆమె కన్నీంటి పర్యంత మయ్యారు.
undefined
తాను బోటుపైకి వచ్చేసరికి తనకు ఎవరో లైఫ్ జాకెట్ ఇచ్చారని ఆమె గుర్తు చేసుకొన్నారు. ఈ ప్రమాదం జరిగిన రెండు మూడు నిమిషాల్లోనే తూటుగుంట గ్రామస్తులు ప్రమాద స్థలానికి చేరుకొని తమను వేరే బోటులో ఒడ్డుకు చేర్చారని చెప్పారు.
undefined
తన భర్తకు ఈత బాగా వచ్చన్నారు. కానీ లైఫ్ జాకెట్ ఆయనకు అందితే ప్రాణాలతో బతికి బయటపడేవాడని ఆమె అభిప్రాయపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని ఆమె అభిప్రాయపడ్డారు.
undefined
దేవీపట్నం పోలీసులు తమ బోటుకు అనుమతి ఇచ్చారని ఆమె చెప్పారు. దేవీపట్నం పోలీసులు అనుమతి ఇవ్వకపోతే బోటు ముందుకు కదిలే పరిస్థితి ఉండకపోయేదన్నారు. తమ బోటుకు అనుమతి ఇచ్చిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
undefined
click me!