వాట్సాప్ లో తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కు సంబంధించిన సేవలు త్వరలో వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వం తెలిపింది. వాట్సాప్ నుంచే భక్తులకు దర్శన టిక్కెట్లు, గదులు బుక్ చేసుకోవడం, విరాళాలు అందించడం వంటి సేవలుల వున్నాయి. దీంతో భక్తుల కష్టాలు మరింత తగ్గనున్నాయని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌గా ప్రసిద్ధి చెందిన 'మన మిత్ర' కార్యక్రమం కింద ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. విజయవాడలోని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల వంటి ఇతర ఆలయాల సేవలను వాట్సాప్‌లో చేర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం సేవలు అందుబాటులో ఉన్నాయి.