తిరుమల తిరుపతి ఆలయ సంపద ఎంత?
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విలువ దాదాపు 3,00,000 కోట్లు రూపాయలని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలిగా గుర్తింపు పొందింది. విజయనగర సామ్రాజ్యంలో ఆలయ సంపద, పరిమాణం పెరగడం ప్రారంభమైంది. ప్రస్తుతం భారీ సంపదతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల్లో 11,225 కిలోల బంగారం, 7,600 ఎకరాలకు పైగా భూమి, పెద్దమొత్తంలో బ్యాంకు డిపాజిట్లు, 9,071.85 కిలోల వెండి ఆభరణాలున్నాయి.
తిరుమల తిరుపతికి నిత్యం దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల నుంచి భక్తులు, యాత్రికులు వస్తుంటారు. నిత్యం రద్దీగా ఉంటుంది. తిరుపతి వెంకన్నకు సమర్పించుకునే కానుకలు, విరాళాలు భారీగానే ఉంటాయి. ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాలలో ఒకటి. దీనికి భక్తుల నుంచి విరాళాలు, కానుకలు కారణం. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహిస్తుంది.