APPSC: ఏపీపీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఓటీపీఆర్ అప్‌డేట్ స్టార్ట్.. ఎలా చేసుకోవాలంటే?

Published : Sep 30, 2026, 09:42 AM IST

APPSC OTPR Update 2026: ఏపీపీఎస్సీ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్. కొత్త లోకల్ కేడర్ నిబంధనల ప్రకారం నేటి నుంచి ఓటీపీఆర్ అప్‌డేట్ ప్రాసెస్ మొదలైంది. ఎలా దీనిని పూర్తి చేయా ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

PREV
15
ఏపీపీఎస్సీ కీలక అప్డేట్.. నేటి నుంచే ఓటీపీఆర్ అప్‌డేట్ ప్రాసెస్ స్టార్ట్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ (APPSC) అత్యంత ముఖ్యమైన సూచన చేసింది. సెప్టెంబర్ 30 నుంచి వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) వివరాలను అప్‌డేట్ చేసుకునే విండో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది.

రాబోయే గ్రూప్-1తో పాటు ఇతర నోటిఫికేషన్లకు అప్లై చేయాలనుకునే ప్రతి అభ్యర్థి తమ ఓటీపీఆర్ ప్రొఫైల్‌ను రీ-వెరిఫై చేసుకుని, సరికొత్త సమాచారంతో అప్‌డేట్ చేయడం తప్పనిసరి. చివరి నిమిషంలో సర్వర్ రష్, సాంకేతిక సమస్యల వల్ల ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ పనిని ముందే పూర్తి చేసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది.

25
క్రొత్త రూల్స్ అండ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్.. అసలు ఈ మార్పులు ఎందుకు?

రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ, నూతన స్థానికత విధానాల నేపథ్యంలో ప్రభుత్వం ఏపీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్-2025, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ జారీ చేసిన జీఓ నంబర్ 45 (G.O.Ms.No.45, ఏప్రిల్ 20, 2026) నిబంధనలను అమల్లోకి తెచ్చింది.

దీని ప్రకారం అభ్యర్థుల 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన విద్యాభ్యాసం, నివాస వివరాల ప్రాతిపదికన వారి జిల్లా, జోన్, మల్టీ-జోన్ కేటగిరీలను సరికొత్తగా నిర్ణయిస్తున్నారు. మీ లోకల్ కేడర్ క్రెడిట్ సరిగ్గా రావాలన్నా, రిజర్వేషన్ ఫలాలు అందాలన్నా ఈ నూతన నిబంధనలకు అనుగుణంగా డేటాను సవరించడం అత్యవసరం.

35
స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్: మొబైల్‌లోనే ఓటీపీఆర్ ఎలా సవరించుకోవాలి?

అభ్యర్థులు ఎటువంటి మీసేవ లేదా ఇంటర్నెట్ కేఫ్‌లకు వెళ్లకుండానే సులభంగా తమ ప్రొఫైల్ అప్‌డేట్ చేసుకోవచ్చు..

1. వెబ్‌సైట్ విజిట్: ముందుగా ఏపీపీఎస్సీ పోర్టల్ psc.ap.gov.in లేదా portal-psc.ap.gov.in ఓపెన్ చేయండి.

2. లాగిన్: హోమ్‌పేజీలో ఉన్న 'OTPR / Candidate Login' ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ User ID (OTPR ID), పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ అవ్వండి.

3. మోడిఫై ఆప్షన్: డ్యాష్‌బోర్డ్‌‌లోని 'Modify OTPR Details' లేదా 'Update Profile' లింక్‌ను సెలెక్ట్ చేయండి.

4. వివరాల నవీకరణ: నూతన జిల్లాల ప్రాతిపదికన మీ స్థానిక జిల్లా, జోన్, మల్టీ-జోన్, 4th-10th చదువుకున్న వివరాలు, విద్యార్హతలు (డిగ్రీ/పీజీ), అడ్రస్, మొబైల్ నంబర్ సరిచూసుకోండి.

5. సబ్‌మిట్, సేవ్: అప్‌లోడ్ చేసిన ఫోటో, సంతకం, సర్టిఫికెట్లతో పాటు అన్ని వివరాలు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని 'Submit' నొక్కండి. అకనాలెడ్జ్‌మెంట్ కాపీని PDF రూపంలో సేవ్ చేసుకోండి.

45
తప్పు సమాచారం ఇస్తే అభ్యర్థిత్వం రద్దు.. అధికారుల కఠిన హెచ్చరిక

ఓటీపీఆర్ నమోదులో అభ్యర్థులు ఇచ్చే సమాచారంపై కమిషన్ కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రొఫైల్‌లో మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, లోకల్ స్టేటస్ వంటి వివరాల్లో చిన్న తప్పు ఉన్నా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి.

రాబోయే ఉద్యోగ నియమకాల సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఓటీపీఆర్ డేటాను అసలు పత్రాలతో నిశితంగా పోలుస్తారు. ఏ మాత్రం తేడాలున్నా లేదా తప్పుడు ప్రకటనలు చేసినట్లు తేలినా సదరు అభ్యర్థిత్వాన్ని తక్షణమే రద్దు చేస్తామని ఏపీపీఎస్సీ తీవ్రంగా హెచ్చరించింది.

55
అభ్యర్థులు వెంట ఉంచుకోవాల్సిన పత్రాలు ఇవే

సవరణల ప్రక్రియను ప్రారంభించే ముందు అభ్యర్థులు తమ వద్ద కొన్ని ముఖ్యమైన ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి..

• స్టడీ సర్టిఫికెట్లు: 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న పక్కా స్టడీ/బోనాఫైడ్ సర్టిఫికెట్లు.

• ఐడెంటిటీ, క్యాస్ట్: ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ దాఖలాలు.

• ఫోటో, సంతకం: ఇటీవల స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, సంతకం డిజిటల్ కాపీలు.

• యాక్టివ్ కాంటాక్ట్ వివరాలు: ఓటీపీ వెరిఫికేషన్ కోసం మీ వద్ద పని చేస్తున్న మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ.

ఇప్పటికే ఓటీపీఆర్ ప్రొఫైల్ ఉన్న పాత అభ్యర్థులు కూడా ఈ నూతన జోనల్ విధానం ప్రకారం లాగిన్ అయ్యి రీ-వెరిఫై చేసుకోవడం తప్పనిసరని అధికారులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories