ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మచిలీపట్నం పర్యటనలో యువత, మహిళలకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. ఆయన ప్రకటించిన ప్రకారం, టీడీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీగా పేర్కొన్న నిరుద్యోగ భృతి పథకాన్ని ఈ ఏడాదిలోనే అమలు చేయనున్నట్లు తెలిపారు.
ఈ పథకం కింద అర్హత కలిగిన నిరుద్యోగుల ఖాతాల్లో ప్రతి నెల రూ.3,000 చొప్పున వార్షికంగా రూ.36,000 జమ చేస్తామని తెలిపారు. “యువత కి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తాం” అని స్పష్టం చేశారు. ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ పథకం ముఖ్యమని చెప్పారు.
26
కార్యకర్తలే టీడీపీకి బలం
కార్యకర్తలే టీడీపీకి బలం “టీడీపీకి కార్యకర్తలే ప్రాణం. వారి కృషికి న్యాయం చేయడమే మాకు ప్రాధాన్యం” అని లోకేష్ చెప్పారు. టెక్నాలజీ సహాయంతో వారి సేవలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తప్పులు చేసినవారెవరు అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
36
తల్లిదండ్రులతో సమావేశాలు
రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులతో సమావేశాలు ప్రజల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోందని లోకేష్ తెలిపారు. జూలై 5న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
మహిళల కోసం ‘తల్లికి వందనం’ పథకం లోకేష్ తన ప్రసంగంలో మహిళల సాధికారత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం ద్వారా తల్లులకు ఆర్థిక, సామాజికంగా అండగా నిలుస్తున్నామని చెప్పారు. “ఈ పథకం లబ్ధిదారులు తల్లులు మాత్రమే కాదు. వారి పిల్లల విద్యా భవిష్యత్తుకూ ఇది బలమైన పునాది” అని వ్యాఖ్యానించారు.
56
ప్రజల మద్దతుతో అధికారం
ప్రజల మద్దతుతో అధికారం టీడీపీ అధిక మెజారిటీతో అధికారంలోకి రావడంపై మాట్లాడుతూ, “94 శాతం సీట్లు గెలవడం వెనుక ప్రజల తీర్పు ఉంది. మా విజయానికి కారణం ప్రజలే” అని పేర్కొన్నారు. తన తల్లి భువనేశ్వరి చంద్రబాబు విజయానికి అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే, తానూ భార్య బ్రాహ్మణితో కలిసి ఇంటి పనుల్లో పాల్గొంటానని చెప్పారు.
66
గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన లోకేష్
గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన లోకేష్ వైఎస్సార్‌సీపీపై విమర్శలు గుప్పించిన లోకేష్, “గతంలో రెడ్‌బుక్ చూపించి బెదిరించిన వాళ్లు ఇప్పుడు భయపడుతున్నారు” అన్నారు. గత ప్రభుత్వ అవకతవకలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను వెనక్కి తీసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన 29 కేసుల్లో ఇప్పటికే 20 కేసులు తొలగించామని, మిగిలినవి కూడా త్వరలోనే రద్దు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తనపై పెట్టిన 23 కేసులు, అందులో SC, ST అట్రాసిటీ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. చంద్రబాబు 54 రోజులు, రవీంద్ర 53 రోజులు జైలులో గడిపిన విషయాన్ని వివరించారు.