ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కి అపరచాణక్యుడని పేరుంది. ఆయన 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆగష్టు సంక్షభం తరువాత కూడా పార్టీని నిలబెట్టగలిగాడు. ప్రతిపక్షంలో పదేండ్లు ఉన్నాడు. ఈ అన్ని ఏండ్లుఒక లెక్క ఇప్పుడొక లెక్క అన్నట్టుగా జగన్ తన అస్త్రాలన్నీ చంద్రబాబు మీద ఎక్కుబెడుతున్నాడు.
సంక్షేమ పథకాలతో జగన్ జనరంజకంగా దూసుకుపోతున్నాడు. ప్రజల్లో జగన్ గ్రాఫ్ బాగానే ఉంది. జనరంజక పాలన అందిస్తున్న ముఖ్యమంత్రుల జాబితాల్లో నిలకడగా జగన్ టాప్ 5 లోనే తన స్థానాన్ని నిలుపుకుంటూ ఉండడం ఆయన రాజకీయ ఇమేజ్ కి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ.
జగన్ దూసుకుపోతుండడంతో టీడీపీ క్యాడర్ లో నైరాశ్యం అలుముకుంది. దానికి తోడు వైసీపీ బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో వ్యాపార వేత్తలు ఎక్కువవడంతో... తమ ఆర్ధిక ప్రయోజనాల దృష్ట్యాపార్టీ నుంచి ఒక్కొక్కరిగా తప్పుకుంటున్నారు. కుదిరితే వైసీపీ లేదంటే బీజేపీ పాటపాడుతున్నారు.
ఇక ఈ తరుణంలో పార్టీని రక్షించుకోవాలి అంటే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం తప్పనిసరి. చంద్రబాబు వయసు పైబడడం ఇక్కడ ప్రధాన కారణం. లోకేష్ ఇంకా టీడీపీని చంద్రబాబు తరహాలో నడిపించగలడా అన్న అనుమానాలు తలెత్తుతుండడంతో... నాయకత్వ బదలాయింపు అధికారంలో ఉన్నప్పుడు జరగడమే మంచిదని ఆయన భావిస్తున్నారు.
ఇక ఆయన వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్ట్యా సాధ్యమయ్యే పని కాదు. రాష్ట్రంలో జనసేన బీజేపీలు సంయుక్తంగా ఒక కూటమిగా ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాలు, మైనారిటీ కులాల ఓట్ బ్యాంకును జగన్ బలంగా ఒడిసిపట్టాడు. ఇక బీసీలు టీడీపీ మద్దతుదారులైనప్పటికీ... గత ఎన్నికల్లో ఆ వర్గం ఓట్లు జగన్ మోహన్ రెడ్డి వైపుగా మరలాయి. వాటిని ఇప్పుడు జగన్ సమర్థవంతంగా కన్సాలిడేటె చేసుకునే పనిలో ఉన్నాడు.
రాష్ట్రంలో బీసీలు మెజారిటీ ఓటర్లు కాగా, వారి తరువాఠీ స్థానంలో కాపులు ఉన్నారు. దాదాపుగా 25 శాతం మంది జనాభా కాపులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. బీసీల తరువాత వారే అత్యధిక సంఖ్యాక ఓటర్లు. వీరిని అఆకట్టుకునే పనిలో ఉంది బీజేపీ.
అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంది. ఆ తరువాత అధ్యక్షుడి మార్పు జరిగినప్పటికీ.. అదే సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజును అధ్యక్షుడిగా చేసారు. ఆయన రాగానే చిరంజీవిని కలిశారు. ఇప్పుడు రాష్ట్రంలోని కాపులందరిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చే యోచనలో ఉంది బీజేపీ. త్వరలో ముద్రగడ, సిబిఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణలను కూడా పార్టీలోకి ఆహ్వానించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రెండు రోజులుగా వంగవీటి రాధా కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతుంది.
ఇలా కాపులందరిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి, బీసీలను కూడా మచ్చిక చేసుకొనిసోషల్ ఇంజనీరింగ్ ద్వారా రాజకీయాలను నడపాలని బీజేపీ యోచిస్తోంది. ఇక జగన్ కి వ్యతిరేకంగా వాడడానికి హిందుత్వ కార్డు ఉండనే ఉంది. ఇదే గనుక జరిగితే అది రాష్ట్రంలోని టీడీపీకి, వైసీపీకి రెంటికీ ప్రమాదమే. వైసీపీ కన్నా టీడీపీ కి అధిక నష్టం కలిగే ప్రమాదం ఉంది.
ఈ అన్ని పరిస్థితుల్లో చంద్రబాబు పార్టీని నిలబెట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ ని తన వైపుగా తిప్పుకోవాలని యోచిస్తున్నాడట. బీజేపీ వైఖరేమిటో క్లియర్ గా బయటపెట్టేసారు. వారు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అవడానికి డిసైడ్ అయ్యారు. జగన్ మా మిత్రపక్షం అని అనేక బహిరంగ వేదికల మీదే చెబుతున్నారు. విమర్శించే మిత్రుడా, లేదా విమర్శించకుండా ఉండే మిత్రుడా అనే విషయం పక్కనపెడితే.... మాత్రం వైసీపీని ఇప్పుడు వారు ఎదుర్కోదల్చుకోలేదు.
వైసీపీని బీజేపీ ఎదుర్కోదల్చుకోలేదు అంటే... టీడీపీని ఖాళీచేయించడం అనేది వారి ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో టీడీపీ బీజేపీతో కలుద్దామని కన్న కలలు ఇప్పుడు కలలు గానే మిగిలిపోనున్నట్టుగా కనబడుతున్న తరుణంలో(ప్రస్తుతానికి మాత్రమే, భవిష్యత్తులో ఏమవుతుందనేది వేచి చూడాలి) ఆయన పవన్ కళ్యాణ్ వైపుగా చూస్తున్నట్టుగావార్తలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో చూసినా కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్, ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహారించే కొన్ని హ్యాండిల్స్ లో బీజేపీ, వైసీపీ ఒక్కటే అనే విషయాన్నీ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పదే పదే ఈ విషయంలో పోస్టులు పెడుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమవలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇదే విషయం పై కొన్ని మీడియా చానెల్స్ లో డిబేట్లు నడుస్తున్నాయి.
అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గాడన్నవిషయంపై చర్చ విపరీతంగానే నడుస్తుంది. దానిపై పవన్ ని బాగానే కార్నర్ చేస్తున్నారు. ప్రస్తుతం చాతుర్మాస దీక్ష అంటూ పవన్ బయటకు రాకుండా ఒకింత తప్పించుకుంటున్నప్పటికీ... మున్ముందు ఆయన ఎలా దీన్ని ఫేస్చేస్తారో వేచి చూడాలి.అమరావతి విషయంలో తప్పాడంటూ పవన్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోపవన్ కళ్యాణ్ నైతిక బాధ్యత తీసుకునేలా చేసినా, లేదా పవన్ ఇరిటేట్అయిఅయినా పవన్ బయటకు వచ్చేసినా అప్పుడు తమకు లాభం అని టీడీపీ స్కెచ్ వేస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. వేచి చూడాలి ఇది ఉత్త ప్రచారమేనా, లేదా నిజమేనా అని.