ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిన్న కూడా సుప్రీంకోర్టులో మరోచుక్కెదురైంది. హైకోర్టులో కేసు ఉండడం, దానిపై ప్రభుత్వం సుప్రీమ్ కి వెళ్లడం, అక్కడ ప్రభుత్వానికి అననుకూలంగా తీర్పు రావడం మనం నిమ్మగడ్డ వ్యవహారం సహా అనేక అంశాల్లో చూసాము.

తాజాగా అమరావతి పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఆర్-5 జోన్ వ్యవహారం హై కోర్టులో విచారణ సాగుతుండగానే .... ప్రభుత్వం సుప్రీమ్ తలుపుతట్టింది. ఈ వ్యవహారంలో హైకోర్టు ప్రభుత్వ నిర్ణయం పై స్టే విధించిన విషయం విదితమే.

హైకోర్టు ఇచ్చిన స్టేను వెకేట్ చేయాలనీ సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది. కానీ మరోమారు ఈ విషయంలో కూడా ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు పరిధిలోని విచారణ సవ్యంగానే సాగుతోందంటూ, ఆ విచారణపై నమ్మకం వ్యక్తం చేసింది.

దీనితో కోర్టుల్లో జగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ అంటూ వార్తలు గుప్పు మన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అసలు ఆ ఆర్-5 భూముల అంశం ఏమిటి, ఎందుకు జగన్ సర్కార్ ఆ వ్యవహారాన్ని అంత సీరియస్ గా తీసుకుంది, వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటనేది ఒకసారి చూద్దాము.

అమరావతిలో పేదలకు ఇండ్ల స్థలాలను ఇవ్వడానికి ప్రభుత్వం దాదాపుగా 1200 ఎకరాల మేర భూములను రెసిడెన్షియల్ జోన్ గా మారుస్తూ వాటిని ఆర్-5 జోన్ గా ప్రకటించింది. ఈ భూములను పేదలకు పంచి పెడతాము అని ప్రభుత్వం ప్రకటించడంతో అమరావతి రైతులు కోర్టుకెళ్లారు. హైకోర్టు దీనిపై స్టే విధించింది.

పేదలకు ఇళ్ల స్థలాలను పంచిపెడదామనే బృహత్తరమైన ఆలోచనకు రైతులు అడ్డుకోవడం ఏమిటి? అందుకు హైకోర్టు కూడా అడ్డుపడడం ఏమిటి అని అనిపించొచ్చు. కానీ ఇక్కడే అసలు మర్మం దాగి ఉంది.

అమరావతిలో సేకరించిన భూములను గనుక పేదలకు పంచిపెడితే... అమరావతి అనే గ్రాండ్ ప్లాన్ ఇక ఉండనే ఉండదు. పేదలకు భూములను పంచిన తరువాత వాటిని వెనక్కి తీసుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది. ఇక భూమే లేనప్పుడు అమరావతి గ్రాండ్ ప్రాజెక్ట్ అనేదే ఉండదు కదా.

భూములను గనుక పంచేస్తే కోర్టుల్లో అమరావతి రాజధాని ప్రస్తావన వచ్చినప్పుడు ఆ భూములను పేదలకు పంచామని, అక్కడ భూములే లేవని ప్రభుత్వం వాదించే ఆస్కారముంటుంది. అంతే కాకుండా సీఆర్డీఏ చట్టంలో కూడా పేదలకు భూములు అనే ఒక అంశాన్ని పొందు పరిచారు.

అమరావతి నిర్మాణం పూర్తయ్యాక, ఉపాధి అవసరాల కోసం, ఈ మహానగరంలో పనిచేయడానికి, ఆధారపడి జీవనమా వెళ్లదీసే పేదలకు భూములను కేటాయించాలని ఆ చటంలో చేర్చారు. అమరావతి నిర్మాణమయితే... పేదలకు ఇండ్లను ఇస్తామన్నారు.

కానీ ఇప్పుడు ఇక్కడ అమరావతి అనే నగర నిర్మాణమే జరగలేదు. జరిగేలా కూడా కనిపించడంలేదు. ఈ భూములను గనుక పంచేస్తే నిర్మించే ఆస్కారమే ఉండదు. ఈ పరిస్థితులను బహుశా బేరీజు వేసుకున్న అమరావతి ప్రాంతవాసులు, భూములిచ్చిన రైతులు కోర్టుకెళ్లారు.

హై కోర్టులో అమరావతి ప్రాంతవాసులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించి హైకోర్టు ప్రభుత్వ నిర్ణయం పై స్టే విధించింది. ఈ స్టే ను వెకేట్ చేయించాల్సిందిగా ప్రభుత్వం సుప్రీమ్ ను ఆశ్రయించింది. హైకోర్టు విచారణలో తమకు అన్యాయం జరుగుతుందని విషయం రుజువైతే మాత్రమే సుప్రీమ్ విచారణకు స్వీకరిస్తుంది. కానీ ఇక్కడ అలాంటిదేమీలేదని, విచారణ సరైన రీతిలో సాగుతోందంటూ సంతృప్తి వ్యక్తం చేసింది.

గతంలో నిమ్మగడ్డ వ్యవహారంలో కూడా సుప్రీమ్ కోర్టు ఇదేవిధంగా వ్యాఖ్యానించడం మనం చూసాము. ఇప్పుడు ఈ ఆర్-5 భూముల వ్యవహారంలోనూ సుప్రీంకోర్టు అదే విధంగా వ్యాఖ్యానించింది. ఇది ఆర్-5 భూముల వ్యవహారం, ఆ భూములకు సంబంధించిన విషయాలు.