Andhra Pradesh లో పేదలకు గుడ్‌ న్యూస్‌..జస్ట్‌ ఒక్క రూపాయి కడితే చాలు..!

Published : Jun 25, 2025, 10:14 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ పేదలకు G+1 ఇల్లు నిర్మాణానికి కేవలం రూ.1కే అనుమతి, సెట్‌బ్యాక్, రహదారి వెడల్పు సడలింపులతో ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 

PREV
15
కేవలం 1 రూపాయికే

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో నివాస భవనాల అనుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పేదలకు తక్కువ ఖర్చుతో ఇంటి కలను నెరవేర్చే దిశగా అనేక సడలింపులు ప్రకటించారు. ముఖ్యంగా పట్టణ పేదలకు కేవలం రూ.1 రూపాయికే G+1 స్థాయి ఇల్లు కట్టేందుకు అనుమతి ఇవ్వనున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు.

25
చిన్న స్థలాల్లో ఇంటి నిర్మాణానికి అనుమతులు:

 50 చదరపు మీటర్ల స్థలంపై G+1 ఇంటి నిర్మాణానికి కేవలం రూ.1కు అనుమతి.

ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా సమీపంలో నివాస భవనం నిర్మించుకునే అవకాశం కల్పిస్తోంది.

సెట్‌బ్యాక్ నిబంధనల్లో భారీగా సడలింపులు:

≤100 చద.మీ. స్థలాల్లో ఇంటి చుట్టూ ఖాళీ వదిలే అవసరం లేదు.

100-500 చద.మీ. స్థలాలు: ముందుభాగంలో 1-3 మీటర్లు, పక్కవైపులా 0.75-2 మీటర్ల వరకు ఖాళీ వదలాలి.

>500 చద.మీ. స్థలాలు: ముందుభాగంలో 3-5.5 మీటర్లు ఖాళీ ఉండాలి, మిగతా వైపులా పాత నిబంధనలు వర్తిస్తాయి.

35
రహదారి వెడల్పుపై సడలింపులు:

 100 చద.మీ. లోపు స్థలాల ఇంటి కోసం: కనీసం 2 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డు సరిపోతుంది.

100 చద.మీ. కంటే ఎక్కువ స్థలానికి: కనీసం 3.6 మీటర్ల వెడల్పు అవసరం.

మరిన్ని వెసులుబాట్లు: 300 చద.మీ. పైగా స్థలాల్లో సెల్లార్ పార్కింగ్‌కు అనుమతి.

సెట్‌బ్యాక్‌ను అవసరాలకు అనుగుణంగా మార్చుకునే వెసులుబాటు.

వేస్ట్ మేనేజ్‌మెంట్: తడి, పొడి వ్యర్థాలను వేరుగా నిర్వహించడం తప్పనిసరి.

బాల్కనీల వెడల్పు: 3 మీటర్ల ఎత్తు దాటి ఉన్న భవనాలకు 1.5 మీటర్ల వెడల్పుతో బాల్కనీలు నిర్మించుకునే వీలు.

45
భద్రతా ప్రమాణాల్లో మార్పులు:

అన్ని రకాల భవనాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి.

సెక్యూరిటీ గార్డుల కోసం పోస్టులు నిర్మించేందుకు అనుమతులు.

నీటి శుద్ధి కోసం STP/ETP ఏర్పాట్లకు అనుమతులు.

పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్: 9 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్లపై పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి.

చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు, వర్క్‌షాప్‌లు పట్టణాల్లో అభివృద్ధి చెందే అవకాశం.

టీడీఆర్ బాండ్లు & తాత్కాలిక నిర్మాణాలు: రోడ్డు విస్తరణల్లో భవన యజమానులు స్థలాన్ని కోల్పోతే, టీడీఆర్ బాండ్లు అందేవరకు తాత్కాలిక నిర్మాణాలకు అనుమతి.

55
ప్రభుత్వ నిర్ణయాల ప్రయోజనాలు:

 పేదలకు తక్కువ ఖర్చుతో సొంతింటి కల నెరవేర్చే అవకాశం.

హౌసింగ్ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసే మార్గదర్శకాలు.

పట్టణ ప్రణాళికలో సమతుల్యత, శుభ్రత, భద్రతకు ప్రాధాన్యత.

చిన్న స్థలాల్లో నివాస భవనాల నిర్మాణానికి స్పష్టమైన మార్గం.

Read more Photos on
click me!

Recommended Stories