
AP Mega DSC : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలను పొందిన అభ్యర్థులు ఫైనల్ జాబితాను ప్రకటించింది. అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ను డిఎస్సి అధికారిక వెబ్ సైట్ apdsc.apcfss.in లో అందుబాటులో ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే అన్ని జిల్లాల విద్యాశాఖ కార్యాలయాలు, కలెక్టరేట్లలో డిఎస్సి ద్వారా ఎంపికైన అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించింది. అయితే ప్రస్తుతం కేవలం 15,941 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు.. మిగతా 406 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయలేదు. కొన్ని విభాగాల్లో అసలు అభ్యర్థులే అందుబాటులో లేకుండాపోయారు... అందుకే ఈ ఉద్యోగాలు ఖాళీగానే మిగిలిపోయాయి. ఇలా ఏ జిల్లాల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ అయ్యాయి... ఎన్ని మిగిలిపోయాయి? అనేది తెలుసుకుందాం.
1. అనంతపురం - నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలు 811 - భర్తీ అయిన ఉద్యోగాలు 755 - భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులు 56 - మొత్తం 93.09 శాతం భర్తీ
2. చిత్తూరు - నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలు 1478 - భర్తీ అయిన ఉద్యోగాలు 1408 - భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులు 70 - మొత్తం 95.26 శాతం భర్తీ
3. తూర్పు గోదావరి - నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలు 1353 - భర్తీ అయిన ఉద్యోగాలు 1349 - భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులు 4 - 99.70 శాతం భర్తీ
4. గుంటూరు - నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలు 1159 - భర్తీ అయిన ఉద్యోగాలు 1140 - భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులు 19 - మొత్తం 98.36 శాతం భర్తీ
5. కడప - నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలు 712 - భర్తీ అయిన ఉద్యోగాలు 680 - భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులు 32 - మొత్తం 95.51 శాతం భర్తీ
6. కృష్ణా - నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలు 1213 - భర్తీ అయిన ఉద్యోగాలు 1203 - భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులు 10 - మొత్తం 99.18 శాతం భర్తీ
7. కర్నూల్ - నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలు 2678 - భర్తీ అయిన ఉద్యోగాలు 2590 - భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులు 88 - మొత్తం 96.71 శాతం భర్తీ
8. నెల్లూరు - నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలు 673 - భర్తీ అయిన ఉద్యోగాలు 657 - భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులు 16 - మొత్తం 97.62 శాతం భర్తీ
9. ప్రకాశం - నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలు 672 - భర్తీ అయిన ఉద్యోగాలు 661 - భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులు 11 - మొత్తం 98.36 శాతం భర్తీ
10. శ్రీకాకుళం - నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలు 543 - భర్తీ అయిన ఉద్యోగాలు 535 - భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులు 8 - మొత్తం 98.53 శాతం భర్తీ
11. విశాఖపట్నం - నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలు 1139 - భర్తీ అయిన ఉద్యోగాలు 1134 - భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులు 5 - మొత్తం 99.56 శాతం భర్తీ
12. విజయనగరం - నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలు 583 - భర్తీ అయిన ఉద్యోగాలు 578 - భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులు5 - మొత్తం 98.14 శాతం భర్తీ
13. పశ్చిమ గోదావరి - నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలు 1074 - భర్తీ అయిన ఉద్యోగాలు 1063 - భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులు 11 - మొత్తం 98.98 శాతం భర్తీ
14. స్టేట్ - నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలు 259 - భర్తీ అయిన ఉద్యోగాలు 243 - భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులు 16 - మొత్తం 93.82 శాతం భర్తీ
15. జోన్-1 - నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలు 395 - భర్తీ అయిన ఉద్యోగాలు 390 - భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులు 5 - మొత్తం 98.73 శాతం భర్తీ
16. జోన్-2 - నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలు 347 - భర్తీ అయిన ఉద్యోగాలు 330 - భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులు 17 - మొత్తం 95.10 శాతం భర్తీ
17. జోన్-3 - నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలు 572 - భర్తీ అయిన ఉద్యోగాలు 558 - భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులు 14 - మొత్తం 97.55 శాతం భర్తీ
18. జోన్-4 - నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలు 686 - భర్తీ అయిన ఉద్యోగాలు 667 - భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులు 19 - మొత్తం 97.52 శాతం భర్తీ
ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తే 15,941 మాత్రమే భర్తీ అయ్యారు. 406 పోస్టులకు అభ్యర్థులే కరువయ్యారు.
కూటమి ప్రభుత్వం మరో హామీని పూర్తిచేందని విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టగానే మొదట మెగా డిఎస్సి అంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు సంబంధించిన ఫైల్ పైనే సంతకం చేశారని లోకేష్ గుర్తుచేశారు. అయితే కేవలం 150 రోజుల్లోనే ఏపీ విద్యాశాఖ మెగా డిఎస్సి 2025 పేరిట భారీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిచేసిందన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను పొందినవారికి అభినందనలు తెలిపారు లోకేష్. ఈసారి ఉద్యోగాలను సాధించలేకపోయివారు నిరుత్సాహపడొద్దని... నిబద్దతతో ప్రిపరేషన్ కొనసాగించాలి, మీకు కూడా అవకాశాలు వస్తాయని లోకేష్ సూచించారు.