Viral News: ఆసుపత్రిలో పచ్చళ్ల అమ్మాయి.. క్షమించమని అడుగుతోన్న అన్వేష్‌

Published : Apr 05, 2025, 05:49 PM IST

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యవహారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే చాలు వీరి గురించే చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఈ అంశంపై ప్రముఖ యూట్యూబర్‌ ప్రపంచయాత్రికుడు అన్వేష్‌ స్పందించారు. ఈ వ్యవహారినికి సంబంధించి ఓ వీడియో పోస్ట్‌ చేశాడు..   

PREV
14
Viral News: ఆసుపత్రిలో పచ్చళ్ల అమ్మాయి.. క్షమించమని అడుగుతోన్న అన్వేష్‌
Anvesh on Alekhya Chitti Pickles issue

పచ్చళ్ల ధర ఎక్కువగా ఉందని ప్రశ్నించినందుకు బండ బూతులు తిట్టి రచ్చకు తెర తీశారు అలేఖ్య చిట్టి పికిల్స్‌ సిస్టర్స్‌. తండ్రిని కోల్పోయినా ధైర్యంతో పచ్చళ వ్యాపారం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ ముగ్గురు సిస్టర్స్‌ టంగ్‌ స్లిప్‌ అవ్వడంతో ఇప్పుడు వ్యాపారం మొత్తం మూసివేసే పరిస్థితి వచ్చింది. దీంతో పలవురు వారికి సపోర్ట్‌ చేస్తుంటే మరికొందరు బాగా జరిగిదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా గడిచిన రెండు రోజులుగా వీరి గురించే చర్చ నడుస్తోంది. 

24
Alekhya Chitti Pickles

తాజాగా యూబ్యూటర్‌ అన్వేష్‌ ఇదే అంశంపై స్పందించారు. ఆ ముగ్గురు తనకు చెల్లెల్లాంటి వారని చెప్పిన అన్వేష్‌.. ఆ ముగ్గురు యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించే ముందు తనను కాంటాక్ట్‌ చేశారని, సలహాలు సూచనలు అడిగారని తెలిపాడు. మొదట్లో వీరు కూడా బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేశారన్న అన్వేష్‌ ఆ తర్వాత వాటిని వదిలేశారని, ఎంచక్కా పచ్చళ్ల వ్యాపారం చేశారని చెప్పుకొచ్చాడు. అయితే తండ్రి లేకపోయినా సొంత కాళ్లపై నిలబడ్డ ఈ అక్కాచెల్లెల్లకు నిత్యం సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చేవని చెప్పుకొచ్చాడు అన్వేష్‌.

 

34
Anvesh

ఈ నెగిటివ్‌ను భరించలేకే చిన్న చెల్లె అలేఖ్య ఇలా మాట్లాడాల్సి వచ్చిందని వారికి సపోర్ట్‌ చేసే ప్రయత్నం చేశాడు. ముగ్గురూ ఎవరినీ మోసం చేయలేదని, కష్టపడి పని చేస్తున్నారని తెలిపాడు. ప్రస్తుతం ఆలేఖ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని చెప్పుకొచ్చాడు. తాను కెనడాలో ఉన్న సమయంలో పికిల్స్‌ వచ్చాయని చాలా రుచిగా ఉన్నాయని తెలిపాడు. అయితే పచ్చళ్ల ధరలు అంతలా ఎందుకు ఎక్కువగా ఉన్నాయని తాను కూడా ప్రశ్నించానని, క్వాలిటీ మెయింటేన్‌ చేయడం వల్లే అంత ధర ఉందని సిస్టర్స్‌ చెప్పుకొచ్చారని అన్వేష్‌ అన్నాడు. 

44
Naa Anveshana avinash about goa

అందుకే అలా తిట్టేసింది.. 

అంతలా బూతులు తిట్టడం వెనకాల ఉన్న కారణాన్ని అన్వేష్‌ వివరిస్తూ.. 'సోషల్‌ మీడియాలో బూతు కామెంట్స్‌ను ఎదుర్కొంటూ ముగ్గురూ పచ్చళ్ల వ్యాపారం చేసుకుంటూ వచ్చారు. అయితే అలేఖ్య మాత్రం వాటిని భరించలేకపోయింది. బీపీ పెరగడంతో ఎవరినీ తిడుతునాన్న విషయాన్ని కూడా మరిచిపోయి తిట్టేసింది. బెట్టింగ్‌ యాప్స్‌ చేసినందుకు భగవంతుడు శిక్ష వేశాడు. వారిని వదిలేయండి. ప్రస్తుతం అలేఖ్య ఆసుపత్రిలో ఉంది. ఇకపై ముగ్గురు సిస్టర్స్‌ పచ్చళ్ల వ్యాపారం చేయరు. త్వరలోనే లడ్డూ వ్యాపారం మొదలు పెడతారు. ముగ్గురు చెల్లెల్లు క్షమాపణలు చెప్పేశారు ఇక వదిలేయండి. దేశంలో ఏ సమస్య లేనట్లు వీరినే పట్టుకొని కూర్చోవడం మానేయండి' అని అన్వేష్‌ చెప్పుకొచ్చాడు. అన్వేష్‌ మాట్లాడిన పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

Read more Photos on
click me!

Recommended Stories