Alekhya chitti: బూతు ఆడియోపై స్పందించిన అలేఖ్య సిస్టర్స్.. ఏం చెప్పారంటే.

గత మూడు రోజులుగా సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే చాలు అలేఖ్య చిట్టి పికిల్స్‌ వ్యవహారమే కనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ఇలా ఇక్కడ చూసిన ఈ పచ్చళ్ల వ్యవహారమే ట్రెండ్‌ అవుతోంది. ఎన్నో రోజులు కష్టపడి సంపాదించుకున్న పేరు ఒక్క ఆడియో కారణంగా పడిపోయింది. దెబ్బకు వాట్సాప్‌ అకౌంట్‌ క్లోజ్‌ అయ్యింది. వెబ్‌సైట్‌ మూత పడింది. అయితే ఈ విషయమై తాజాగా అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరు స్పందించారు. 
 

Alekhya Chitti Pickles Controversy Sister Summa Responds to Viral Audio Clip with Clarification in telugu VNR

సోషల్‌ మీడియాను సరిగ్గా ఉపయోగించుకున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్‌ పేరుతో వ్యాపారం మొదలు పెట్టి మంచి పేరు సంపాదించుకున్నారు. ముగ్గురు అక్కా చెల్లెల్లు కలిసి నాన్‌ వెజ్‌ పికిల్స్‌ తయారీని ప్రారంభించి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్‌ అయ్యారు. అయితే సంపాదించుకున్న మంచి పేరును ఒక్క రోజులో కోల్పోయారు. ఒక చిన్న ఆడియో వారి వ్యాపారాన్ని కోలుకోని దెబ్బ కొట్టింది. వేలాది మంది రిపోర్ట్‌ కొట్టడంతో వాట్సాప్‌ బ్లాక్‌ అయ్యింది. 

Alekhya Chitti Pickles Controversy Sister Summa Responds to Viral Audio Clip with Clarification in telugu VNR
alekhya pickles issue

అసలేం జరిగింది.? 

పచ్చళ్ల ధరలను వివరిస్తూ అలేఖ్య పికిల్స్‌ సిస్టర్స్‌ వాట్సాప్‌లో ఒక మెసేజ్‌ చేశారు. ఈ మెసేజ్‌కు స్పందించిన ఓ యూజర్‌ ధరలు మరీ ఇంత ఎక్కువ ఉన్నాయంటూ కామెంట్ చేశాడు. దీనికి బదులుగా అలేఖ్య సిస్టర్స్‌ నుంచి ఓ దారుణమైన ఆడియో మెసేజ్ వచ్చింది. పచ్చళ్లు కొనుగోలు చేయలేని నీకు పెళ్లి కూడా అవసరం లేదంటూ రాయడానికి కూడా వీలు లేని భాషను ఉపయోగించారు. 

దీంతో సదరు యూజర్‌ కాస్త ఆ ఆడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ఓ రేంజ్‌లో వైరల్‌ అయ్యింది. చాలా మంది నెటిజన్లు అలేఖ్య సిస్టర్స్‌కు వ్యతిరేకంగా కామెంట్స్‌ చేయడం మొదలు పెట్టారు. వారి వాట్సాప్‌ బిజినెస్‌కు రిపోర్ట్‌ కొట్టడంతో అకౌంట్‌ కాస్త క్లోజ్‌ అయ్యింది. చివరికి వ్యాపారమే క్లోజ్‌ అయ్యే పరిస్థితి వచ్చేసింది. అలేఖ్య సిస్టర్స్‌ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌ కూడా మూతపడింది. 
 


Viral News

స్పందించిన అలేఖ్య సిస్టర్స్‌

దీంతో వ్యవహారం కాస్త చేయి దాటుతుండడంతో అలేఖ్య సిస్టర్స్‌ దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముగ్గురు అక్కా చెల్లెళ్లలో ఒకరైన సుమ కంచర్ల వివాదంపై స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. వైరల్‌ అవుతోన్న ఆడియోలోని గొంతు తన చెల్లి గొంతు అని తేల్చి చెప్పేశారు. అయితే వేరే వారికి పెట్టాల్సిన మెసేజ్‌ను సదరు వ్యక్తికి పెట్టామని, అందుకు గాను సదరు వ్యక్తికి క్షమాపణలు చెబుతున్నట్లు వివరించారు. 

తమకు రోజుకు వందలాది మెసేజ్‌లు వస్తుంటాయని వాటిలో తమను బూతులు తిడుతూ వచ్చే మెసేజ్‌లు ఎక్కువగా ఉంటాయని సుమ తెలిపారు. ఇందుకు ప్రతిస్పందనగానే అలాంటి పదజాలాన్ని ఉపయోగించాల్సి వచ్చిందన్నారు. ఒకరికి పెట్టాల్సిన మెసేజ్ మరికొరికి షేర్ చేశామని తెలిపారు. సుమారు 35 వేల మంది వాట్సాప్‌ రిపోర్ట్‌ కొట్టినట్లు తెలిపారు. దీంతో వాట్సాప్‌లో రిప్లై ఇవ్వలేకపోయామన్నారు. బ్యాడ్ మెసేజ్‌లు వెళ్లిన వ్యక్తిని వ్యక్తిగతంగా సంప్రదించి అతనికి క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఆడియో ఫైల్‌ను వినిపించారు. సుమ కంచర్ల షేర్‌ చేసిన పూర్తి వీడియో చూడ్డానికి ఇక్కడ క్లిక్‌ చేయండి. 

Latest Videos

vuukle one pixel image
click me!