ఏపీ పాలనలో టెక్నాలజీ విప్లవం: చంద్రబాబు సర్కార్ కీలక ముందడుగు

చంద్రబాబు సర్కార్ ఆంధ్ర ప్రదేశ్ లో టెక్నాలజీ విప్లవానికి శ్రీకారం చుడుతున్నారు. టెక్నాలజీని జోడించి ప్రజలకు స్మార్ట్ పాలన అందించేందుకు చర్యలు చేపట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. 

BC Janardhan reddy

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాలనలో టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగనే వ్యవసాయంతో పాటు ఇతర రంగాల్లో డ్రోన్లను ఎక్కవగా వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్ ఆండ్ బి, మౌళిక సదుపాయాల శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి తో  డ్రోన్ తయారీ కంపనీలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల్లో డ్రోన్ల వినియోగంపై మంత్రితో చర్చించారు ప్రతినిధులు. ఈ సమావేశం వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని బిసి జనార్థన్ రెడ్డి తెలిపారు. 

Andhra Pradesh

వ్యవసాయం, రోడ్లు మరియు భవనాలు వంటి కీలక శాఖలతో పాటు పారిశుద్ద్య నిర్వహణలో డ్రోన్లను ఎక్కువగా వినియోగించవచ్చు. అలాగే ఇరిగేషన్, అర్బన్ ఏరియా డెవలప్మెంట్, డిఫెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, మైనింగ్, సర్వేలు మరియు మ్యాపింగ్, సీడ్ బాల్స్ ప్లాంటేషన్ వంటి వివిధ రకాల పనులను ఈ డ్రోన్ టెక్నాలజీ సులభతరం చేస్తుందని ప్రతినిధులు మంత్రికి వివరించారు. తద్వారా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. 


Andhra Pradesh

ఇలా హైదరాబాద్ కు చెందిన వింగ్స్ ఆండ్ ప్రోప్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్,  సిడక్ కంపనీ సీఈఓ ప్రవీణ్ కుమార్ మంత్రితో సచివాలయంలో భేటీ అయ్యారు. డ్రోన్ టెక్నాలజీ ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడుతుందో... పనులను ఎలా సులభతరం చేయవచ్చో  మంత్రికి వివరించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల డ్రోన్ టెక్నాలజీ గురించి చేసిన కామెంట్స్ ను ఈ సమావేశంలో గుర్తుచేసుకున్నారు. 
 

ఇప్పటివరకు ఏయే రంగాల్లో తమ టెక్నాలజీని వినియోగించి మంచి ఫలితాలు సాధించారో మంత్రికి క్షుణ్ణంగా వివరించారు కంపనీ ప్రతినిధులు.రానున్న కాలంలో డ్రోన్ హబ్ ఏపీలో ఏర్పాటుకు ఏవిధమైన అవకాశాలు ఉన్నాయో... దీని వల్ల రాష్ట్రానికి ఏ విధంగా లాభం చేకూరుతుందో మంత్రికి వివరించారు.  ఈ విషయాలన్నింటిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి డ్రోన్ కంపనీల యజమానులకు తెలిపారు. భవిష్యత్ లో డ్రోన్ల వినియోగం బాగా పెరగనుందని... అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. 

Latest Videos

click me!