గుడ్‌న్యూస్: హైద్రాబాద్‌లో ఉంటున్న వారు ఏపీకి రావొచ్చు, కానీ షరతు ఇదీ....

First Published May 14, 2020, 11:03 AM IST

తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు రావాలని భావిస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైద్రాబాద్ లో ఉన్న వారిని తమ స్వంత గ్రామాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు ఏపీ సర్కార్ చర్యలు తీసుకొంటుంది.

హైద్రాబాద్ లో నివాసం ఉంటున్న ఏపీ రాష్ట్రానికి చెందిన వాళ్లను స్వరాష్ట్రంలో ప్రవేశించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. తమ గ్రామాలకు వెళ్లాలనుకొన్నవారంతా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని ఏపీ ప్రభుత్వం నిబంధన పెట్టింది. మరో వైపు హైద్రాబాద్ లో ఉన్న వారిని ఏపీకి తరలించేందుకు ఏపీఎస్ఆర్‌టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.
undefined
లాక్ డౌన్ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుండి తమ స్వగ్రామాలకు వచ్చేందుకు వచ్చిన ఏపీ వాసులు ఎక్కడివారు అక్కడే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. తమ గ్రామాలకు వెళ్లేందుకు వచ్చినవారు సరిహద్దుల్లోనే వెయిట్ చేసి తిరిగి వెళ్లిన సందర్భాలు కూడ లేకపోలేదు.
undefined
స్వంత ప్రాంతాలకు వచ్చేవారికి అనుమతి ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్ లో ధరఖాస్తు చేసుకొన్నవారిని రాష్ట్రానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తారు. ఈ పోర్టల్ లో ధరఖాస్తు చేసుకొన్నవారిని ఆర్టీసీ బస్సుల్లో స్వంత ప్రాంతాలకు తరలించనున్నారు.
undefined
స్వస్థలాలకు చేరుకొన్న తర్వాత ప్రయాణీకులను వారికి సమీపంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఉంచనున్నారు. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
undefined
ఏపీ రాష్ట్రానికి వస్తామని హైద్రాబాద్ లో 8 వేల మంది, రంగారెడ్డి జిల్లా పరిధిలో 5 వేల మంది స్పందన పోర్టల్ లో ధరఖాస్తు చేసుకొన్నారు. మొత్తం 13 వేల మందిని స్వంత రాష్ట్రానికి తరలించేందుకు అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు.మియాపూర్, కూకట్‌‌పల్లి హౌసింగ్ బోర్డు, ఎల్బీనగర్ లలో ప్రయాణీకులను తీసుకొని ఈ బస్సులు ఏపీలోని తమ స్వగ్రామాలకు తీసుకెళ్లనున్నాయి.
undefined
అయితే ఈ బస్సులను రెండు మూడు రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని ఏపీ సర్కార్ అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత ఈ బస్సులు ప్రారంభం కానున్నాయి.
undefined
తొలుత హైద్రాబాద్ లో ఉన్నవారిని తరలించిన తర్వాత చెన్నై, బెంగుళూరులలో ఉన్న వారిని కూడ ఏపీ రాష్ట్రానికి రప్పించనున్నారు.బెంగుళూరులో 2700, చెన్నైలో 1700 మంది ఏపీకి వచ్చేందుకు ధరఖాస్తు చేసుకొన్నారని అధికారులు తెలిపారు.
undefined
click me!