Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు సర్జరీ.. అసలు జనసేనానికి ఏమైంది? టెన్షన్ లో అభిమానులు

Published : Jul 10, 2026, 03:52 PM IST

Pawan Kalyan : భుజం నొప్పితో బాధపడుతున్న ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్‌ ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకోనున్నారు. కొంత కాలంగా ఈ సమస్యతో బాధపడుతున్న జనసేనానికి అసలు ఏమైంది?

PREV
14
నొప్పిని భరిస్తూ.. ప్రజా సేవలోనే పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు కేరాఫ్ అడ్రస్. అయితే, గత కొంతకాలంగా ఆయన రెండు భుజాల తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ప్రజా సేవ కోసం, ఎన్నికల ప్రచారం కోసం, ఆ తర్వాత కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించడం కోసం ఈ నొప్పిని భరిస్తూనే ఆయన నిరంతరం ముందుకు సాగారు.

తాజాగా, ఆయన తన భుజాలకు శస్త్రచికిత్స చేయించుకోవడానికి ముంబై పయనమయ్యారు. ముంబైలోని ప్రఖ్యాత కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఈ సర్జరీ జరగనుంది. ఈ కారణంగానే ఆయన తాజా కేబినెట్ సమావేశానికి కూడా హాజరుకాలేదు.

24
అసలు పవన్‌కు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి?

పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రొటేటర్ కఫ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వైద్య పరిభాషలో చెప్పాలంటే, భుజం కీలును పట్టి ఉంచే కండరాలు, స్నాయువుల సముదాయాన్ని రొటేటర్ కఫ్ అంటారు. నిరంతర ఒత్తిడి వల్ల ఈ కండరాలు చిట్లిపోయాయి. జూన్ నెలాఖరులోనే ఆయన తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ముంబై వెళ్లి పరీక్షలు చేయించుకోగా, రెండు భుజాల కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, తక్షణమే సర్జరీ అవసరం అని వైద్యులు తేల్చి చెప్పారు. సినిమా లైఫ్‌లో చేసిన రిస్కీ యాక్షన్ స్టంట్లు, రాజకీయాల్లోకి వచ్చాక చేసిన సుదీర్ఘ పర్యటనలు, రోడ్ షోలలో అభిమానుల మధ్య రద్దీ వల్ల భుజాలపై తీవ్ర ఒత్తిడి పడి ఈ పాత గాయాలు మళ్లీ తిరగబెట్టాయి.

34
డాక్టర్లు అప్పుడే చెప్పినా.. ఎందుకు లేట్ అయింది?

నిజానికి డాక్టర్లు జూన్ నెలలోనే పవన్‌కు అర్జంట్‌గా ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ, అప్పుడే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం, డీసీఎంగా తనపై ఎన్నో కీలక బాధ్యతలు ఉండటంతో ఆయన వెనక్కి తగ్గలేదు. ముందుగా నిర్ణయించిన ప్రభుత్వ అధికారిక సమీక్షలు, శాఖల వారీగా కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాతే సర్జరీ చేయించుకుంటానని వైద్యులకు స్పష్టం చేశారు. తన వ్యక్తిగత ఆరోగ్యం కంటే ప్రజల పనులకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, నొప్పిని ఓర్చుకుంటూనే ఇన్నాళ్లూ డ్యూటీ చేశారు. సర్జరీకి వెళ్లే ముందు కూడా జనసేన పార్టీ కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశమై, కమిటీల ఏర్పాటుపై దిశా నిర్దేశం చేసి మరీ ముంబై బయలుదేరారు.

44
డాక్టర్ల ప్లాన్ ఏంటి? ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి?

తాజా షెడ్యూల్ ప్రకారం, జులై 10న ముంబై చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు జులై 11 శనివారం నాడు శస్త్రచికిత్స జరగనుంది. అయితే, రెండు భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే రోజువారీ పనులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి, వైద్యులు ఒక ప్లాన్ చేశారు. మొదట తీవ్రంగా ఉన్న ఒక భుజానికి ఆపరేషన్ చేసి, కొద్ది రోజుల గ్యాప్ తర్వాత రెండో భుజానికి సర్జరీ చేయనున్నారు.

ఆపరేషన్ తర్వాత ఆస్పత్రిలో ఐదు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. డిశ్చార్జ్ అయ్యాక కనీసం వారం నుంచి 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరం అని, భుజాలు నార్మల్ స్టేజ్‌కి రావడానికి కొన్ని వారాల పాటు ఫిజియోథెరపీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories