విశాఖపై పట్టు: చంద్రబాబును కౌంటర్ చేసే జగన్ వ్యూహం ఇదే....

First Published Aug 11, 2020, 4:07 PM IST

జగన్ మూడు రాజధానుల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్టు ఆయన నిర్ణయాలను బట్టి, ఆయన వైఖరిని బట్టి తెలుస్తుంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రాజధాని తరలింపు పై స్థబ్ధత నెలకొంది కానీ... లేకుంటే ఈపాటికి జోరుగా తరలింపు కార్యక్రమాలు జరుగుతుండేవి.

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు సంబంధించిన హడావుడి నడుస్తూనే ఉంది. ఒక పక్క అమరావతిలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతుంటే.... విశాఖలో రాజధాని ఏర్పాటు చేసినందుకు నీరాజనాలు పడుతున్నారు.
undefined
జగన్ మూడు రాజధానుల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్టు ఆయన నిర్ణయాలను బట్టి, ఆయన వైఖరిని బట్టి తెలుస్తుంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రాజధాని తరలింపు పై స్థబ్ధత నెలకొంది కానీ... లేకుంటే ఈపాటికి జోరుగా తరలింపుకార్యక్రమాలు జరుగుతుండేవి. ప్రభుత్వ వర్గాలకు ఇప్పటికే ఎప్పుడంటే అప్పుడు తరాలడానికి సిద్ధంగా ఉండాలని సమాచారం అందినట్టు తెలుస్తుంది.
undefined
తాజగా ప్రధాన మంత్రి కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక ఆహ్వాన పత్రిక వెళ్ళింది. విశాఖలో రాజధాని ఏర్పాటుకు మోడీని ఆహ్వానిస్తూ లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 16వ తేదీన అందుకు తొలుత ముహూర్తం కూడా పెట్టేసింది. కానీ.... కోర్టు కేసు నేపథ్యంలో ఇప్పుడు దానిని ప్రస్తుతానికి కొన్ని రోజులపాటు వాయిదా వేసినట్టు తెలుస్తుంది.
undefined
ఇక జగన్ మోహన్ రెడ్డి ప్రధానిని ఆహ్వానించడంతో ఒక పెద్ద వ్యూహమే దాగి ఉంది. ప్రధానిని ఆహ్వానించడం వల్ల ఆయన తన నిర్ణయానికి ఆమోద ముద్ర వేయించుకోవడంతోపాటుగా చంద్రబాబుకు సైతం చెక్ పెట్టేందుకు యోచిస్తున్నారు జగన్.
undefined
అమరావతి శంకుస్థాపనకుప్రధాని పవిత్ర జలాలు, మట్టిని తీసుకొచ్చారు. ఆయన రాజధానికి శంకుస్థాపన చేసారు. ఇప్పుడు విశాఖకు కూడా ప్రధాని చేతుల మీదుగానే శంకుస్థాపన చేపిస్తే.... రాజధాని ఎక్కడుండాలి అనే విషయంలో ఆనాడు సైతం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు,నేడు కూడా జోక్యం చేసుకోబోదు అనే విషయాన్నీ చెప్పినట్టు అవుతుంది.
undefined
అంతే కాకుండా మొన్న న్యాయస్థానంలో కేంద్రం రాజధాని ఎక్కడుండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని, దానిపై తాము తలదూర్చబోమని అఫిడవిట్ దాఖలు చేసారు. కేంద్రం ఈ విషయంలో తలదూర్చబోవడంలేదని పదే పదే రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్నారు.
undefined
ఇక ప్రధాని గనుక ఈ కార్యక్రమానికి హాజరయితే.... బీజేపీ ఎంతగా కేంద్రానికి సంబంధం లేదని చెప్పినప్పటికీ... తమకు అన్ని పార్టీల మద్దతు ఉందని, కేవలం టీడీపీ మాత్రమే వ్యతిరేకిస్తుందనడానికి ఆస్కారం ఉంది.
undefined
టీడీపీ ఒక్కటే మూడు రాజధానులకువ్యతిరేకం అని.... అమరావతి రాజధానిగా ఉండడం వల్ల లాభపడేది ప్రజలు కాదని, టీడీపీ అధినేత, పార్టీ, వారి కార్యకర్తలే అని చెప్పుకునే వీలు వైసీపీకి ఉంటుంది. టీడీపీని రాష్ట్రంలో ఇలా ఏకాకిని చేయాలనిచూస్తున్నాడు జగన్.
undefined
ఈ విధంగా మూడు రాజధానులు అందరి మద్దతు కూడగట్టాము అని జగన్ బయటకు చూపెట్టగలిగితే టీడీపీ ఒంటరయిపోతుంది.ఎన్నికల తర్వాత పూర్తి నైరాశ్యంలో కూరుకుపోయిన టీడీపీకి అమరావతి ఉద్యమం పార్టీగా బ్రతకడానికి ఊపిరులు ఊదింది.
undefined
ఇప్పుడు ఆ అమరావతే ఉద్యమం అనేది లేకుండా చేయగలిగితే చంద్రబాబును మరింతగా బలహీనపరచవచ్చు. వైసీపీలోకి వలసలు ఆగడానికి టీడీపీ రాజకీయంగా ఒకింత ఆక్టివ్ అవడమే అని అంటున్నారు. ఇప్పుడు అమరావతి అంశమే గనుక వీక్ అయిపోతే... టీడీపీకి ఇప్పుడు వైసీపీ పై ఆ స్థాయిలో గురిపెట్టడానికి ఎటువంటి అంశమూ లేదు.
undefined
ఈ పరిస్థితులన్నీ బేరీజు వేసుకున్న జగన్ అందుకే ప్రధాని నరేంద్ర మోడీని ఈ శంకుస్థాపన మహోత్సవానికి ఆహ్వానించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం కూడా అవసరం. అందునా వైసీపీ ప్రస్తుతానికి బీజేపీతో సఖ్యతతోనే మెలుగుతుంది.
undefined
click me!