అమరావతిలో నిర్మాణాలకు రూ.9,165 కోట్లు: రైతుల భయం ఇదీ....

First Published Aug 11, 2020, 1:22 PM IST

అమరాావతి రైతుల ఆందోలనలు కొనసాగుతున్నాయి. సుమారు 240 రోజులకు పైగా రైతుల ఆందోళనలు సాగుతున్నాయి. అమరావతి రైతుల కోసం ప్రభుత్వం ఏ రకమైన న్యాయం చేయనుందో ప్రభుత్వం స్పష్టత ఇస్తే రైతులకు ఊరట లభించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో భాగంగా అమరావతిలో ఇప్పటివరకు రూ. 9,165 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటుకు రంగం సిద్దం చేసింది. దీంతో అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
undefined
శాసన రాజధానిగా అమరావతి కొనసాగనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే శాసన రాజధానిగా అమరావతి ఉంటే తమకు ప్రయోజనం ఏమిటనే అభిప్రాయంతో భూములు ఇచ్చిన రైతాంగం ఆవేదన చెందుతోంది.
undefined
2014లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబునాయుడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశాడు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబునాయుడు అవసరమైన భూమి కోసం ల్యాండ్ పూలింగ్ చేపట్టాడు.
undefined
అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం 53 వేల ఎకరాలను సేకరించారు. భూమి సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ను చంద్రబాబునాయుడు సర్కార్ అప్పట్లో తెరమీదికి తీసుకొచ్చింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా 34 వేల ఎకరాల భూమిని సేకరించింది. మరో 15 వేల ఎకరాలను ప్రభుత్వ భూమిని కూడ సేకరించింది.
undefined
2015 జనవరి 1న ల్యాండ్ పూలింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఆ సమయంలో ల్యాండ్ పూలింగ్ పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఆనాడు ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడ ల్యాండ్ పూలింగ్ పై విమర్శలు గుప్పించింది. వైసీపీ తీవ్రంగా టీడీపీపై విమర్శలు చేసింది.
undefined
అమరావతి పరిసర గ్రామాల్లోని 28,538 మంది రైతుల నుండి 34,395 ఎకరాల భూమి సేకరించింది ప్రభుత్వం. మొదటి ఫేజ్ రాజధాని పనుల అంచనా 55 వేల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఖర్చు చేయాలని తలపెట్టింది. ఇతరత్రా పద్దతుల ద్వారా నిధులను సేకరించాలని నిర్ణయం తీసుకొంది.ఇప్పటివరకు రాజధాని నిర్మాణం కోసం 9,165 కోట్లు ఖర్చు చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
undefined
రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి ఏటా కౌలు చెల్లించడంతో పాటు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాజధాని నిర్మాణమైతే ఈ ప్రాంతంలో భూముల దరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ఈ ప్రాంత రైతులు భావించారు.
undefined
రాజధాని నిర్మాణం కోసం ఎకరం లోపు భూమి ఉన్న 20,490 మంది రైతులు భూమి ఇచ్చారు. ఎకరం నుండి రెండెకరాలు ఉన్న 5,227 మంది రైతులు భూమి ఇచ్చారు.2 నుండి 5 ఎకరాలు 3,337 మంది రైతులు, 5 నుండి 10 ఎకరాలు 668 మంది రైతులు, 20 ఎకరాలకు పై బడిన రైతులు 17 మంది రైతులు భూములు ఇచ్చారు.
undefined
జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది.దీంతో అమరావతి నుండి రాజధానిని మారిస్తే తమకు ఏం లాభమని భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. అమరావతిలోనే రాజధానిని ఉండాలని డిమాండ్ చేస్తూ సుమారు 240 రోజుల నుండి రాజధాని గ్రామాల రైతులు ఆందోళన చేస్తున్నారు.
undefined
గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రభుత్వం రైతులకు కౌలును ఇటీవల ఇచ్చింది. అయితే శాసన రాజధాని ఒక్కటే ఉంటే ప్రయోజనం ఉండదని అమరావతి వాసులు ఆందోళన చెందుతున్నారు.
undefined
అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు తిరిగి తమ భూములు తీసుకొంటే ఆ భూములు వ్యవసాయానికి పనికిరావు. ఒకవేళ రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా చెల్లించాలంటే పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారంగా డబ్బులు చెల్లించాలంటే రూ. 50 వేల కోట్ల చెల్లించాల్సి ఉంటుందని అంచనా.
undefined
ఒక ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను తర్వాతి ప్రభుత్వం కొనసాగించడం సంప్రదాయం. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఘటనలను కూడ చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తున్నారు.
undefined
మూడు రాజధానులకు కట్టుబడి ఉంటామని చెబుతున్న ప్రభుత్వం అమరావతి రైతులకు ఏమి ఇస్తామో ప్రభుత్వం స్పష్టం చేస్తే రైతులకు ఊరట లభించే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.
undefined
click me!