గంటాకు జగన్ గ్రీన్ సిగ్నల్ వెనక: అదే బాటలో మరింత మంది

First Published Aug 10, 2020, 7:41 PM IST

వైసీపీ శ్రేణులు గంటాపై తీవ్ర ఆరోపణలు చేస్తూ... ఆయన రాకను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతున్నారు. అవంతి వంటి వారు చివరి ప్రయత్నముగా ఆరోపణలు సైతం చేస్తున్నారు. ఈ స్థాయిలో వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ... వైసీపీ అధిష్టానం మాత్రం ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధమవుతుంది. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర రాజకీయాలు చాలా డిఫరెంట్ గా సాగుతున్నాయి. ఆ ప్రాంతంలో వరుసగా జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
undefined
కరోనా వైరస్ ఒక పక్కనుండి వణికిస్తున్న ప్పటికీ,మూడు రాజధానుల అంశం మొత్తం పొలిటికల్ స్పేస్ నే ఆక్రమిస్తున్నప్పటికీ... ఉత్తరాంధ్ర రాజకీయాల్లోవీటన్నిటితోపాటుగా మరో అంశం కూడా కాకరేపుతోంది. అదే గంటా శ్రీనివాసరావు అంశం.
undefined
వైసీపీ శ్రేణులు గంటాపై తీవ్ర ఆరోపణలు చేస్తూ... ఆయన రాకను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతున్నారు. అవంతి వంటి వారు చివరి ప్రయత్నముగా ఆరోపణలు సైతం చేస్తున్నారు. ఈ స్థాయిలో వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ... వైసీపీ అధిష్టానం మాత్రం ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధమవుతుంది.
undefined
గంటా బలమైన నాయకుడే. అంగ బలం, అర్థ బలం రెండు పుష్కలంగా ఉన్న నాయకుడు. సామాజికవర్గ అండ కూడా ఉంది. కానీ వీటిని మాత్రమే పరిగణలోకి తీసుకోలేదు వైసీపీ అధిష్టానం. దీని వెనుక రెండు ప్రధాన కారణాలు కనబడుతున్నాయి.
undefined
గంటా పార్టీలో చేరుతుండడంతో ఆయన వెంటా మరికొంతమంది సీనియర్ నేతలు కూడా పార్టీలోకి రానున్నట్టు తెలుస్తుంది. భీమవరం మాజీ ఎమ్మెల్యే అంజిబాబు సైతం టీడీపీని వీడి వైసీపీలో గంట వెంట చేరుతారు అనే మాట వినబడుతుంది. ఆయన గంటా శ్రీనివాసరావు కి దగ్గరి బంధువు.
undefined
భీమవరం సీటును అక్కడ ఈసారి జగన్ గాలిలో వైసీపీ దక్కించుకుంది. కానీ ఆ ప్రాంతంలో టీడీపీకి బలం బలగం రెండు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంజిబాబు వైసీపీలో చేరితే అక్కడ టీడీపీ మరింతగా బలహీన పడుతుంది.
undefined
విశాఖకు చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యేని కూడా గంటా తన వెంట తీసుకువస్తానని చెప్పాడట. గంటా బేషరతుగా చేరుతుండడంతోపాటుగా మరికొందరు బలమైన నేతలను తీసుకొని వస్తుండడంతో.... వైసీపీ అధిష్టానం గంటాను చేర్చుకోవడానికి ఒక కారణం.
undefined
ఈ కారణంతోపాటుగా మరోకారణం కూడా కనబడుతుంది. విశాఖను ఇప్పుడు జగన్ పరిపాలనా రాజధానిగాచేయబోతున్నారు. అమరావతిని చంద్రబాబు తన బ్రాండ్ గా ప్రొజెక్ట్చేసారు. అలానే ఇప్పుడు జగన్ విశాఖను బ్రాండ్ జగన్ గా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు.
undefined
విశాఖలో ఇప్పుడు జగన్ తన మార్క్ ను చూపెట్టాలనుకుంటే... అక్కడ టీడీపీని సాధ్యమైనంతమేర బలహీన పరచాలి. గంటా తోపాటుగా మరో ఎమ్మెల్యేను గనుక లాగగలిగితే... విశాఖలో టీడీపీకి ఉన్న నలుగురు ఎమ్మెల్యేల బలంలో 50 శాతాన్ని లాగేసినట్టే అవుతుంది.
undefined
తోడుగా ఎమ్మెల్యేలు వస్తుండడం, స్వతహాగా గంటా బలమైన నాయకుడవ్వడం, విశాఖ రాజధానిగా చేసి, ఆ నగరంపై తనదైన చెరగని ముద్ర వేయాలని భావిస్తున్న జగన్ ఈ కారణాలతో గంటాను ఇన్ని నిరసనలు, వ్యతిరేకతలు మధ్య సైతం పార్టీలో చేర్చుకోవడానికి అంగీకరించారు.
undefined
వాస్తవానికి.... గంట శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నాడన్న సంకేతాలు రాగానే వైసీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జి విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆయన పై తీవ్రమైన ఆరోపణలు చేసారు. ఆయన స్కాముల్లో కూరుకుపోయాడని వారు ఆరోపించారు. తొలుత విజయసాయి రెడ్డి, ఆతరువాత అవంతి.... ఇద్దరు ఒకరితరువాత ఒకరిగా విమర్శలను గుప్పించారు.
undefined
ఈ విషయమై ఒక్క మాట కూడా మాట్లాడలేదు గంటా. కామ్ గా ఉంటూనే తన పని కానిచ్చుకున్నాడు. విజయసాయి రెడ్డి కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.... సజ్జల రామకృష్ణ రెడ్డి ద్వారా తన చేరికకు జగన్ చేత ఎస్ అనిపించాడు
undefined
తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని అవంతి శ్రీనివాసరావు విమర్శించారు.అధికారం ఎక్కడ ఉంటే గంటా అక్కడ ఉంటారన్నారని ఆయన ఆరోపించారు. అధికారం లేకపోతే గంటా శ్రీనివాసరావు ఉండలేరని, తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోనేందుకు దొడ్డిదారిన వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
undefined
దీనంతటిని చూసిన వైసీపీ అధిష్టానం... సంచయిత వల్ల ప్రయోజనాలు అనేకం అని గ్రహించడంతోపాటుగా... గజపతుల వంశానికే చెందినదవడం వల్ల... రాజకుటుంబానికి విశ్వాసపాత్రులుగా ఉన్న కుటుంబాల మద్దతు కూడా దక్కుతుందని అనుకున్నారు.
undefined
click me!