ఇడుపులపాయలో షర్మిల పర్యటన కవరేజికి అనుమతి ఉందంటూ మీడియాకు మెసేస్ లు వచ్చాయి. దీంతో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బంది ఫోన్ చేసి మరీ మీడియా ప్రతినిధులకు తెలిపారు. దీనికోసం శుక్రవారమే హైదరాబాద్ నుంచి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలీ రెడ్డి కడప విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి విజయమ్మ ఇడుపులపాయకు వెళ్లారు.