టికెట్ల వ్యవహారం.. నానికి ఏపీ మంత్రుల కౌంటర్, బయటకొస్తున్న సినీ ప్రముఖులు

First Published | Dec 23, 2021, 11:27 PM IST

ఏపీలో సినిమా టికెట్ల (cinema tickets) తగ్గింపు వ్యవహారం ఓ కుదుపు కుదుపుతోంది. దీనికి తోడు రెండు రోజుల నుంచి థియేటర్లపై దాడుల వ్యవహారం మరింత రచ్చలేపుతోంది. ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని (nani) చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి. దీనికి ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) , కన్నబాబు (kannababu) కౌంటర్ ఇచ్చారు.

Sobhu Yarlagadda

బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. మాగ్జిమమ్ రిటైల్ ప్రైస్ (ఎమ్మార్పీ) అనేది ఓ వస్తువు ఉత్పత్తిదారులు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. అంతేతప్ప, ఎమ్మార్పీ ధరలు ప్రభుత్వం నిర్ణయించదని శోభు యార్లగడ్డ చురకలు అంటించారు. 

Theatre

సినిమా టికెట్ల వ్యవహారం నేపథ్యంలో ఏపీలో 50 థియేటర్లు మూతపడ్డాయని శోభు అన్నారు. దీని ప్రభావం రాబోయే చిత్రాల విడుదలపైనే కాకుండా, దీర్ఘకాలంలో ఎగ్జిబిటర్ వ్యవస్థపైనా, తెలుగు సినీ పరిశ్రమపైనా తీవ్రస్థాయిలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 
 


ap high court

ఇప్పటికే సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషన్ దారులకు మాత్రం వెసులుబాటు కల్పించింది. 

Tollywood

ఏపీ సర్కార్ సైతం ఈ వివాదానికి తెరదించింది. రాష్ట్రం మొత్తం జీవో నెం 35 రద్దు అమల్లోనే వుందని.. కాకపోతే టికెట్ల రేట్ పెంపు నిర్ణయం మాత్రం జాయింట్ కలెక్టర్ల చేతుల్లోనే వుంటుందని తెలిపింది. ఇలాంటి పరిస్ధితుల్లోనే నాని చేసిన వ్యాఖ్యలు.. ఏపీ సర్కార్‌పై టాలీవుడ్‌ ఎంత గుర్రుగా వుందనేది చెబుతున్నాయి. 

Latest Videos

click me!