అన్న క్యాంటీన్ మెనూ ఇదే... ఏరోజు, ఏ ఫుడ్, ఏ సమయంలో, ఎంత పెడతారు... పూర్తి సమాచారం

First Published | Aug 17, 2024, 11:10 AM IST

ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఏ రోజు ఏ ఫుడ్ ఎంత పెడతారు.. ఏ సమయంలో పెడతారో పూర్తి సమాచారం..

Anna Canteen

Anna Canteen : పేదవాళ్ళ ఆకలిబాధను అర్థం చేసుకున్న చంద్రబాబు సర్కార్ 'అన్న క్యాంటీన్' లను తిరిగి ప్రారంభించింది. గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి... అయితే కూటమి ప్రభుత్వం పాలనాపగ్గాలు చేతబట్టగానే ముందుగా ఈ క్యాంటీన్ల పున:ప్రారంభానికి చర్యలు తీసుకుంది. ఇలా రెడీ అయిన 100 అన్న క్యాంటిన్లను స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రారంభించారు. 

Anna Canteen

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సతీసమేతంగా విచ్చేసి కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు కొందరికి స్వయంగా భోజనం వడ్డించారు... అంతేకాదు పేదలకు అందించే ఆ భోజనం రుచిచూసారు. ఇలా అన్న క్యాంటీన్ లో అందించే 5 రూపాయల భోజనాన్ని చంద్రబాబు దంపతులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు తిన్నారు. ఇలా పేదలతో కలిసే భోజనం చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

Anna Canteen

ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ ను గురువారం లాంఛనంగా ప్రారంభించగా... రాష్ట్రవ్యాప్తంగా మాత్రం మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు శుక్రవారం ప్రారంభించారు. ఈ అన్న క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు లక్షా ఐదువేల మంది మూడుపూటల ఆహారం అందించనున్నారు. ఉదయం 35 వేల మందికి టిఫిన్, మద్యాహ్నం మరో 35 వేలమందికి లంచ్, రాత్రి ఇంకో 35 వేల మందికి డిన్నర్ అందించనున్నారు. కేవలం నామమాత్రపు ధర (5 రూపాయలకే) భోజనం అందించనున్నారు. 

Anna Canteen

అన్న క్యాంటీన్లో అందించే ఆహారం : 

అన్న క్యాంటీన్ లో వివిధ రకాల టిఫిన్స్, భోజనం అందించనున్నారు. ఏ రోజు ఏ ఆహార పదార్థాలు అందించనున్నారో తెలుసుకుందాం.  
 
సోమవారం :

టిఫిన్ : ఇడ్లీ (చట్ని లేదా పొడి, సాంబార్) లేదా పూరీ కుర్మా 

లంచ్, డిన్నర్ : అన్నంతో పాటు ఓ కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి 

మంగళవారం : 

టిఫిన్ : ఇడ్లీ (చట్ని లేదా పొడి, సాంబార్) లేదా ఉప్మా (చట్ని లేదా పొడి, సాంబార్, మిక్చర్) 
 
లంచ్, డిన్నర్ : అన్నం, కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి 

బుధవారం : 

టిఫిన్ : ఇడ్లీ (చట్ని లేదా పొడి, సాంబార్) లేదా పొంగల్ (చట్ని లేదా పొడి, సాంబార్, మిక్చర్) 

లంచ్, డిన్నర్ : అన్నం, కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి 

గురువారం : 

టిఫిన్ : ఇడ్లీ (చట్ని లేదా పొడి, సాంబార్) లేదా పూరీ కుర్మా 

లంచ్, డిన్నర్ : అన్నంతో పాటు ఓ కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి 

శుక్రవారం : 

టిఫిన్ : ఇడ్లీ (చట్ని లేదా పొడి, సాంబార్) లేదా ఉప్మా (చట్ని లేదా పొడి, సాంబార్, మిక్చర్) 

లంచ్, డిన్నర్ : అన్నంతో పాటు ఓ కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి 

శనివారం : 

టిఫిన్ : ఇడ్లీ (చట్ని లేదా పొడి, సాంబార్) లేదా పొంగల్ (చట్ని లేదా పొడి, సాంబార్, మిక్చర్) 

లంచ్, డిన్నర్ : అన్నంతో పాటు ఓ కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి 

Anna Canteen

అయితే ప్రతి ఆదివారం మాత్రం అన్న క్యాంటీన్లు మూసివేసి వుంటాయి. ఎలాంటి ఆహారం లభించదు. వారంలో ఒకరోజు స్పెషల్ రైస్ అందిస్తారు. 

5 రూపాయలకు మూడు ఇడ్లీలు, 3 పూరీలు అందిస్తారు. వీటితో అందించే చట్నీ/పొడి 15 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, మిక్చర్ 25 గ్రాములు వుంటుంది.  పొంగల్ అయితే 250 గ్రాములు, అన్నం 400 గ్రాములు, పప్పు 120 గ్రాములు,  కూర 100 గ్రాములు, పచ్చడి 15 గ్రాములు,పెరుగు 75 గ్రాములు ఇస్తారు. 

Anna Canteen

ప్రతిరోజూ ఆహారం లభించే సమయం : 

ఉదయం 7.30 నుండి 10 గంటల వరకు టిఫిన్ 

మధ్యాహ్నం 12.30 నుండి 3 గంటల వరకు లంచ్ 

రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు డిన్నర్ 

Latest Videos

click me!