టార్గెట్ రోజా ... చంద్రబాబు ఆట మొదలెట్టారుగా...

First Published | Aug 17, 2024, 9:27 AM IST

మాజీ మంత్రి రోజా చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఆమెపై అవినీతి, అక్రమాల ఆరోపణలున్న నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ సీరియస్ గా ముందుకు వెళుతోంది. 

Roja

Roja : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గతంలో వైసిపి పాలనలో ప్రతిపక్ష టిడిపి నాయకులకు ఎదురైన పరిస్థితే ఇప్పుడు వైసిపి నాయకులకు ఎదురవుతోంది. ముఖ్యంగా గత ఐదేళ్లలో నోటికి పనిచెప్పిన మాజీ మంత్రులు కొడాలి నాని, వల్లభనేని వంశీ,  జోగి రమేష్ వంటివారిని ఇప్పటికే కూటమి సర్కార్ టార్గెట్ చేసిందని స్పష్టంగా అర్థమవుతోంది. తాజాగా మహిళా మంత్రి రోజా చుట్టు ఉచ్చు బిగిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.  

Roja

గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోజా క్రీడాశాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ సమయంలోనే క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేందుకు, క్రీడలను ప్రోత్సహించేందుకంటూ రాష్ట్రవ్యాప్తంగా 'ఆడుదాం ఆంధ్ర'కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. 

Latest Videos


roja

ఇక అంతకు ముందు 'సీఎం కప్' పేరిట కూడా క్రీడా ఫోటీలు నిర్వహించారు. అందులోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలా గత ఐదేళ్లలో క్రీడాశాఖ చేపట్టిన అనేక కార్యక్రమాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలా క్రీడామంత్రులుగా పనిచేసిన రోజా, ధర్మాన కృష్ణదాస్ తో పాటు మరికొందరు కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు ఆంధ్ర ప్రదేశ్ సిఐడికి ఫిర్యాదులు అందాయి. 

Roja

గత జూన్ లో ఏపీకి చెందిన మాజీ కబడ్డీ ప్లేయర్, ఆట్యా-పాట్యా  అసోసియేషన్ సిఈవో ఆర్.డి.ప్రసాద్ క్రీడాశాఖలో జరిగిన అక్రమాలపై ఏపీ సిఐడికి ఫిర్యాదు చేసారు. ఈ పిటిషన్ పై స్పందించిన సిఐడి ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజయవాడ పోలీస్ కమీషనర్ ను సిఐడి ఆదేశించింది. ఇలా మాజీ మంత్రి రోజా చుట్టు ఉచ్చి బిగుసుకుంటోంది. 
 

Roja

ఇప్సటికే 'ఆడుదాం ఆంధ్ర' పేరుతో జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెడతామని... బాధ్యులను వదిలిపెట్టేది లేదని ప్రస్తుత క్రీడల మంత్రి రాంప్రసాద్ రెడ్డి  హెచ్చరించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినవారిపై తప్పకుండా చర్యలుంటాయని కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇలా గత ఐదేళ్లలో క్రీడాశాఖలో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం సీరియస్ గా వుంది... విచారణ వేగంగా చేపట్టేందుకు సిద్దమైంది.
 

click me!