శనివారం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. శ్రీకాకుళం జిల్లాలో 16 మండలాలు, విజయనగరంలో 24, పార్వతీపురం మన్యంలో 15, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3, పోలవరం (ఏలూరు/పశ్చిమ గోదావరి పరిధి) 9, అనకాపల్లిలో 2, కాకినాడలో 3, తూర్పుగోదావరిలో 1 మండలంలో తీవ్ర వడగాలులు వీయనున్నాయి. ఇవే కాకుండా శ్రీకాకుళం (2), పోలవరం (2), అనకాపల్లి (1), కాకినాడ (2), తూర్పుగోదావరి (3), ఏలూరు (4), ఎన్టీఆర్ (1), పల్నాడు (2) మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తాయని ప్రఖర్ జైన్ వెల్లడించారు.