దరఖాస్తు ప్రక్రియ :
ఏపీలోని జోన్ 3 కి ప్రాంతానికి చెందివుండి... పైన పేర్కొన్న విద్యార్హతలు, వయసు కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://cfw.ap.nic.in ను సందర్శించండి.
అందులో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు అప్లికేషన్ ఫారం వుంటుంది. అది డౌన్లోడ్ చేసుకోవాలి.
సంబంధిత పత్రాలను జతచేసి అప్లికేషన్ ఫారంను గుంటూరులోని మెడికల్ ఆండ్ హెల్త్ సర్విసెస్ రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలో సమర్పించాలి. దరఖాస్తు స్వీకరించినట్లుగా అధికారులు రసీదును అందిస్తారు. దాన్ని జాగ్రత్తగా వుంచాలి...తర్వాత భర్తీ ప్రక్రియలో ఉపయోగపడుతుంది.
ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జనవరి 15, 2025 వరకు అప్లికేషన్స్ స్వీకరిస్తారు. జనవరి 17 నుండి 23 వరకు దరఖాస్తులను పరిశీలించి జనవరి 24న మెరిట్ లిస్ట్ ప్రచురిస్తారు. అప్పటినుండి జనవరి 27 వరకు అభ్యంతరాలను స్వీకరించి జనవరి 29న తుది మెరిట్ జాబితాను రెడీ చేస్తారు. జనవరి 30, 31 తేదీల్లో కౌన్సిలింగ్, దృవపత్రాల పరిశీలన చేపడతారు. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు.
దరఖాస్తు ఫీజు :
ఓసి అభ్యర్థులకు రూ.700 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి వుంటుంది. ఎస్సి, ఎస్టి,బిసి,ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
ఈ దరఖాస్తు ఫీజును గుంటూరు రీజినల్ డైరెక్టర్ మెడికల్ ఆండ్ హెల్త్ సర్వీస్ పేరిట డిడి (డిమాండ్ డ్రాప్ట్) చేయాల్సి వుంటుంది.