Weather Update: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Published : Jul 05, 2026, 03:19 PM IST

AP Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

PREV
15
వాయుగుండం ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రాలో వణుకు పుట్టిస్తున్న వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌తో పాటు బంగాళాఖాతంలో చోటుచేసుకున్న మార్పులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై గట్టి ప్రభావం చూపిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం కాస్తా ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అయ్యింది. ఆదివారం ఉదయం 08:30 గంటల సమయానికి ఇది వాయుగుండంగా మారినట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని బాలాసోర్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు, చాంద్‌బలికి ఈశాన్యంగా 60 కిలోమీటర్లు, అలాగే పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణ-నైరుతి దిశలో 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా తీరాన్ని దాటే ఛాన్స్ ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ పి. లక్ష్మీ నరసింహమూర్తి వెల్లడించారు. దీని వల్ల ఏపీలో రాగల మూడు రోజుల పాటు వానలు దంచికొట్టనున్నాయి.

25
తీరం దాటనున్న వాయుగుండం.. ఏపీపై ఎఫెక్ట్

ఈ వాయుగుండం కదలికల వల్ల రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలో వాతావరణం కూల్ కానుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రుతుపవనాలు ఫుల్ యాక్టివ్‌గా ఉండటంతో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా క్లౌడీ వెదర్ ఉండటంతో పాటు ఒకటి, రెండు చోట్ల హెవీ రెయిన్స్ పడొచ్చు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పోలవరం లాంటి ప్రాంతాల్లో లైట్ నుండి మోడరేట్ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

35
ఉత్తర కోస్తాకు భారీ అలర్ట్

ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో వర్షాలు కురువనున్నాయి. ఆదివారం ఇక్కడ చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరప్రాంతాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో ఈదురుగాలులు వీస్తాయి. సోమవారం కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతూ, 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మంగళవారం నాటికి ఉరుములతో కూడిన జల్లులు పడుతూ, గాలులు కంటిన్యూ అవుతాయని వెదర్ రిపోర్టు పేర్కొంది.

45
దక్షిణ కోస్తా, రాయలసీమల్లోనూ వర్షాలు

దక్షిణ కోస్తా విషయానికి వస్తే.. ఆది, సోమవారాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే వీలుంది. ఇక్కడ కూడా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మంగళవారం కూడా వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండవు, కొన్ని చోట్ల వానలు పడుతూనే ఉంటాయి. ఇక రాయలసీమలో కోస్తాతో పోలిస్తే ఈ వాయుగుండం ఎఫెక్ట్ కాస్త తక్కువగానే ఉంటుంది. మూడు రోజుల పాటు అక్కడక్కడా ఒకటి రెండు చోట్ల మాత్రమే లైట్ వానలు పడొచ్చు. కానీ గాలులు మాత్రం గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలంగా వీస్తాయి.

55
జనాలకు అలర్ట్.. వాతావరణ శాఖ జాగ్రత్తలు

సముద్రం బాగా అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున, తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్లు, గరిష్ఠంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. అందుకే మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లొద్దని అధికారులు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు జనాలు చెట్ల కింద గానీ, భారీ హోర్డింగ్స్, కరెంట్ స్తంభాల పక్కన గానీ నిలబడకూడదని అధికారులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories