Andhra pradesh: న‌న్ను, ప‌వ‌న్‌ను తిట్టేందుకు కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు.? చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు

Published : Jul 05, 2026, 02:55 PM IST

Andhra pradesh: మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో ప‌లు అంశాలపై మాట్లాడారు. త‌న‌తో పాటు ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని తిట్ట‌డానికి వైసీపీ కోట్లు ఖ‌ర్చు చేస్తోంద‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. 

PREV
15
దుష్ప్రచారానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని ఆరోపణ

తమ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. తనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికల్లో విమర్శలు చేయడానికి కొన్ని గ్రూపులకు ప్రత్యేకంగా నిధులు అందుతున్నాయని అన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించడమే లక్ష్యంగా కొందరు పనిచేస్తున్నారని, హింస, అసభ్యకర వ్యాఖ్యలు, ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు.

25
కుప్పం రూపురేఖలు మారుతున్నాయి..

కుప్పం నియోజకవర్గంలో గతంతో పోలిస్తే ఇప్పుడు భారీ స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. రహదారులు, రవాణా, కమ్యూనికేషన్, ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అనేక ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే పూర్తిగా మారిన కుప్పాన్ని ప్రజలు చూస్తారని పేర్కొన్నారు. కేవలం కుప్పమే కాదు, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు.

35
క్వాంటమ్ కంప్యూటింగ్ నుంచి స్టీల్ పరిశ్రమల వరకు పెట్టుబడులపై దృష్టి

రాష్ట్రంలో అధునాతన సాంకేతిక రంగాలకు పెద్దపీట వేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీ, సెమీకండక్టర్ రంగాల్లో భారీ పెట్టుబడులు తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంధన రంగంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే ప్రముఖ స్టీల్ కంపెనీలు ఆర్సెలార్ మిత్తల్, జేఎస్‌డబ్ల్యూ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నాయని వెల్లడించారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు.

45
భూసమస్యల పరిష్కారం, పరిశ్రమలకు ప్రోత్సాహం

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు తెలిపారు. గతంలో కొన్ని భూకేటాయింపులు వివాదాలకు దారితీయడంతో విలువైన భూములు, ఖనిజ వనరులు సద్వినియోగం కాకుండా పోయాయని పేర్కొన్నారు. కొన్ని సంస్థలు కూడా ఈ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయని చెప్పారు.

పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, పెట్టుబడులను నిరుత్సాహపరిచే విధానాలకు తావు ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి ప్రాజెక్టులను ఇతరులు తమ విజయాలుగా చెప్పుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.

55
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. హంద్రీ-నీవా కాలువ ద్వారా ఇప్పటికే కుప్పం వరకు కృష్ణా జలాలను తీసుకొచ్చామని చెప్పారు. అలాగే గాలేరు-నగరి ప్రాజెక్టును కూడా త్వరలో పూర్తి చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని, రాష్ట్ర ప్రగతిని ఎలాంటి అడ్డంకులు ఆపలేవని చంద్రబాబు స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories