ఏనుగులను తరిమేందుకు రంగంలోకి పవన్ కల్యాణ్: ఏంటీ కుంకీ ఏనుగులు?

First Published | Aug 8, 2024, 12:04 PM IST

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కర్ణాటక రాజధాని బెంగళూరుకు బయలుదేరారు. రైతులకు పెద్ద సమస్యగా మారిన ఏనుగులను తరిమికొట్టేందుకు ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. అందుకోసమే బెంగళూరు పర్యటన...

Pawan Kalyan

Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. ఎలాంటి సమస్య అయినా ఆయన దృష్టికి వచ్చిదంటే వెంటనే పరిష్కార మార్గాలు వెతుకుతున్నారు. ఇలా ఎప్పటినుండో అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల రైతులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి స్వయంగా రంగంలోకి దిగారు అటవీ శాఖ మంత్రి పవన్. 
 

Pawan Kalyan

పవన్ కల్యాణ్ గురువారం పొరుగురాష్ట్రం కర్ణాటకలో పర్యటించనున్నారు. బెంగళూరులో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో సమావేశం కానున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని రైతులు ఎదుర్కొంటున్న ఏనుగుల గుంపు సమస్యపై ఆయనతో చర్చించనున్నారు. ఈ విషయంలో కర్ణాటక అనుసరిస్తున్న విధానాలను తెలుసుకుని వాటిని ఏపీలోనూ అమలు చేయాలని పవన్ భావిస్తున్నారు. 


Pawan Kalyan

ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం ఏనుగుల గుంపులు జనావాసాలు, పంటపొలాలపై పడి ప్రాణనష్టం, పంటనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఒకవేళ ఏనుగుల గుంపు అడవిలోంచి బయటకు వస్తే వాటిని తిరిగి అడవిలోకి పంపేందుకు కుంకీ ఏనుగులను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి కుంకీ ఏనుగులు కర్ణాటకలో చాలా వున్నాయి.  
 

Pawan Kalyan

ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో కూడా ఏనుగుల సమస్య వుంది. ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. అనేక సందర్భాల్లో ప్రాణనష్టానని కలిగించాయి. దీంతో కర్ణాటక ఫార్ములానే ఈ జిల్లాలో అనుసరించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసమే పవన్ కన్నడ మంత్రితో సమావేశం కానున్నారు. 

Pawan Kalyan

కర్ణాటకలోని కొన్ని కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు పవన్. వీటి ద్వారా ఏనుగుల బెడద వున్న ప్రాంతాల్లో వాటిని ఉపయోగించనున్నారు. ఏనుగుల సమస్య పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇచ్చారు పవన్. వెంటనే యాక్షన్ లోకి దిగిన ఆయన కర్ణాటక ప్రభుత్వంలో చర్చకు పయనమయ్యారు.

Pawan Kalyan

ఇటీవల అరణ్య భవన్ అటవీశాఖ ఉన్నతాధికారులు పవన్ సమావేశం సందర్భంగా ఏనుగుల సమస్య చర్చకు వచ్చింది. తమవద్ద కుంకీ ఏనుగుల సమస్య వుందని పవన్ కల్యాణ్ కు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో స్వయంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కుంకీ ఏనుగులను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఇందుకోసమే నేడు పవన్ కల్యాణ్ కర్ణాటక పర్యటన.

Latest Videos

click me!