ఎక్కడ తగ్గాలో పవన్ కు బాగా తెలుసు... ఆ విషయంలో అందుకే వెనక్కితగ్గారు

First Published | Aug 7, 2024, 10:45 PM IST

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ విషయంలో వెనక్కితగ్గారు. ఇలా తీసుకున్న నిర్ణయాన్ని జనసైనికులతో పాటు టిడిపి శ్రేణులు స్వాగతిస్తూ పవన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకూ ఆ నిర్ణయమేంటో తెలుసా..?

Pawan Kalyan

Pawan Kalyan : పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో 'ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి' అనే ఓ డైలాగ్ వుంటుంది... ఇది ఆ సినిమాలో పవన్ ను ఉద్దేశించి వాడిన డైలాగ్. ఈ సినిమాలో మాదిరిగానే రాజకీయాల్లోనూ ఈ డైలాగ్ పవన్ కు సరిగ్గా సరిపోతుంది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయమే అందుకు నిదర్శనం. 
 

Pawan Kalyan

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 100శాతం స్ట్రైక్ రేట్ తో అద్భుత విజయాన్ని అందుకున్నారు పవన్. ఇలా కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఆయన డిప్యూటీ సీఎంగా, వివిధ శాఖల మంత్రిగా మారారు. ఇలా ఎక్కడ నెగ్గాలో తనకు తెలుసని నిరూపించారు. 
 


Pawan Kalyan

తాజాగా పవన్ కల్యాణ్ ఓ కీలక ప్రకటన చేసారు. గతంలో అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లను కూడా ఏర్పాటుచేయాలని సీఎం చంద్రబాబును పవన్ కోరిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలా ఎక్కడ తగ్గాలో తెలుసని నిరూపించారు. 

Pawan Kalyan

అసలు స్టోరీ ఏమిటంటే ఈ ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ విజ్ఞప్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నిర్ణయమూ తీసుకోకపోవడంపై చర్చ జరుగుతోంది. అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ పేరిట కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని పవన్ కోరారు... ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పినా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. 
 

Pawan Kalyan

అయితే ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మద్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు.  ఈ క్రమంలోనే డొక్కా సీతమ్మ క్యాంటీన్ల విషయంలో వెనక్కి తగ్గారు పవన్. గతంలో 2019 వరకు కొనసాగినట్లుగానే అన్నా క్యాంటీన్లను కొనసాగించాలని పవన్ సూచించారు. అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గ పేరును పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నిర్ణయించిన నేపథ్యంలో క్యాంటీన్ల విషయంలో తన నిర్ణయం మార్చుకున్నట్లు... ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లినట్లు పవన్ ప్రకటించారు. 

Pawan Kalyan

డొక్కా సీతమ్మ పేరును మిడ్ డే మిల్స్ కు కొనసాగించడమే సబబు... దీనివల్ల ప్రతి విద్యార్థికి ఆమె గొప్పదనం తెలుస్తుందన్నారు. పాఠశాల స్థాయిలో విశిష్ట వ్యక్తులు, దాతృత్వం కలిగినవారి పేర్లమీద పథకాలు ఉండటమే మంచిదన్నారు. దీనివల్ల భావితరాలకు మేలు కలుగుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. 

Latest Videos

click me!