AP Localbody Elections 2026 : ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నామినేషన్లు షురూ... పూర్తి షెడ్యూల్ ఇదే

Published : Oct 21, 2026, 12:47 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సందడి నెలకొంది. మున్సిపల్, ఎంపిటిసి, జడ్పిటిసి, పంచాయితీ ఎన్నికలన్ని ఒకేసారి నిర్వహింస్తున్నారు… ఇప్పటికే షెడ్యూల్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.

PREV
13
ఏపీలో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల సందడి

Andhra Pradesh Elections : ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది... దీంతో అన్నిపార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇలా నగరాలు, పట్టణాల్లో ఎన్నికల సందడి నెలకొనగా ఇప్పుడు గ్రామాల్లోనూ రాజకీయాలు హీటెక్కాయి. ZPTC(జడ్పిటిసి), MPTC(ఎంపిటిసి) ఎన్నికల ప్రక్రియ ఇవాళ్టి (అక్టోబర్ 21, బుధవారం) నుండి ప్రారంభం అయ్యింది.

23
ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల షెడ్యూల్ ఇదే..

ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిసంస్థల ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమీషన్ ప్రకటించింది. దీని ప్రకారం మొదట మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి... తర్వాత ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలోని మొత్తం 659 జడ్పిటిసి, 9829 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

అక్టోబర్ 21 (బుధవారం) - ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం

అక్టోబర్ 23 (శుక్రవారం) - నామినేషన్ జారీకి చివరితేదీ

అక్టోబర్ 27 (మంగళవారం) - నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ

నవంబర్ 3 (మంగళవారం) - ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్

నవంబర్ 5 (గురువారం) - ఓట్ల లెక్కింపు, పలితాలు వెల్లడి

33
పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..

జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు ముగియగానే గ్రామ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మొత్తం మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి.

మొదటి విడత

నవంబర్ 13 (శుక్రవారం) - నోటిఫికేషన్ రిలీజ్

నవంబర్ 17 (మంగళవారం) - నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ

నవంబర్ 21 (శనివారం) - నామినేషన్ల ఉపసంహరణ గడువు

నవంబర్ 26 (గురువారం) - పోలింగ్, ఇదేరోజు ఓట్ల లెక్కింపు, పలితాలు వెల్లడి ఉంటుంది.

రెండవ విడత

నవంబర్ 16 (సోమవారం) - నోటిఫికేషన్ రిలీజ్

నవంబర్ 20 (శుక్రవారం) - నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ

నవంబర్ 24 (మంగళవారం) - నామినేషన్ల ఉపసంహరణ గడువు

నవంబర్ 29 (ఆదివారం) - పోలింగ్, ఇదేరోజు ఓట్ల లెక్కింపు, పలితాలు వెల్లడి ఉంటుంది.

మూడో విడత

నవంబర్ 19 (గురువారం) - నోటిఫికేషన్ రిలీజ్

నవంబర్ 23 (సోమవారం) - నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ

నవంబర్ 27 (శుక్రవారం) - నామినేషన్ల ఉపసంహరణ గడువు

డిసెంబర్ 2 (బుధవారం) - పోలింగ్, ఇదేరోజు ఓట్ల లెక్కింపు, పలితాలు వెల్లడి ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories