Pawan Kalyan
Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. బాధితులు తన వద్దకు రావాల్సిన అవసరం లేదు... సమస్య గురించి తెలిస్తే ఆయనే స్వయంగా స్పందిస్తున్నారు. ఇలా కూటమి అధికారంలోకి వచ్చాక తన మంత్రిత్వ శాఖలను సమర్దవంతంగా నిర్వహిస్తూనే ప్రజా సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరిస్తున్నారు. అయితే తాజాగా పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురం రాజకుటుంబానికి చెందిన ఓ వృద్దురాలి ఆవేదనను చూసి చలించిపోయారు. దీంతో వెంటనే ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
Pithapuram
పిఠాపురం వృద్దురాలి కష్టమేమిటి..?
పిఠాపురం పట్టణంలో విన్నపాల చంద్రలేఖ అనే వృద్దురాలు నివాసముంటున్నారు. తమ పూర్వీకుల నుండి వచ్చిన ఇంట్లోనే ఈమె కుటుంబం కలిసి వుంటున్నారు. ఈమె పిఠాపురం మహారాజ కుటుంబానికి చెందినవారు. గత 50 ఏళ్లుగా నివాసముంటున్న ఇళ్ళు ఇప్పుడు తమదంటూ కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని చంద్రలేఖ ఆవేదన వ్యక్తం చేసారు.
Pithapuram
తమ ఇంటిని ఆక్రమించుకునేందుకు కొందరు దౌర్జన్యం చేస్తున్నారని వృద్దురాలితో పాటు ఆమె కొడుకులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకాలం ఎంతో గౌరవంగా బ్రతికిన తమను రోడ్డుకు ఈడ్చేందుకు ప్రయత్నిస్తున్నారని... వృద్దురాలని కూడా చూడకుండా ఆమెపై దాడి కూడా చేసారట. ఇలా రాజకుటుంబానికి చెందిన తమకే అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రలేఖ ఆవేదన చెందారు.
Pawan Kalyan
ఇలా వృద్దురాలు ఇంటికోసం పడుతున్న ఆవేదన ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. దీంతో ఈ వ్యవహారం కాస్త ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన ఈ మహిళకు న్యాయం జరిగేలా చూడాలని... ఈ ఇంటి సమస్య ఏమిటో చూడాలని... వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Pawan Kalyan
పవన్ ఎంట్రీతో సీన్ మొత్తం మారింది..:
వృద్దురాలికి పవన్ అండగా నిలవడంతో సీన్ మొత్తం మారిపోయింది. అప్పటివరకు ఇంటిని కబ్జా చేయాలని ప్రయత్నించినవారి పక్షాన నిలిచిన ఎస్సై సైలెంట్ అయ్యారట. ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసు పెడతానంటూ ఎస్సై బెదిరించారని చంద్రలేఖ కొడుకులు తెలిపారు. అంతేకాదు అధికారులెవ్వరూ తమ గోడు వినిపించకోలేదని అన్నారు. కానీ పవన్ కల్యాణ్ స్పందించిన తర్వాత అందరూ మారారని చంద్రలేఖ కుటుంబం చెబుతోంది.
Pawan Kalyan
ఇప్పటికే కాకినాడ ఆర్డీవో పిఠాపురంలోని చంద్రలేఖ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఇంటికి సంబంధించిన వివాదం పిఠాపురం జూనియర్ సివిల్ కోర్టులో ఉన్నందున ఈమె కుటుంబాన్ని ఇబ్బందిపెట్టరాదని అవతలి పక్షానికి అధికారులు హెచ్చరించారు. ఇకపై వారి జోలికి రాకూడదని...ఏదయినా వుంటే చట్టపరంగా కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. తమకు అండగా నిలిచిన పవన్ కల్యాణ్ కు చంద్రలేఖతో పాటు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు చెబుతున్నారు.
అయితే ప్రసార మాధ్యమాల ద్వారా తన దృష్టికి వచ్చిన వృద్దురాలి సమస్యను పరిష్కరించేందుకు పవన్ ఆదేశాలివ్వడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నారు. జన సైనికులు, మెగా ఫ్యాన్స్ అయితే పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక పిఠాపురం ప్రజలు కూడా పవన్ స్పందించిన తీరుకు ఫిదా అవుతున్నారు... సరైన నాయకుడినే ఎన్నుకున్నామంటూ కొందరు పొగుడుతున్నారు.