ఇక టిడిపి కూటమి ఘన విజయం తర్వాత నారా, నందమూరి కుటుంబం జరుపుకున్న సంబరాల్లో నారా దేవాన్ష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. అతడిచేతే కుటుంబసభ్యులు కేక్ కట్ చేయించారు. తాత, నాన్నమ్మ చంద్రబాబు, భువనేశ్వరితో పాటు తల్లిదండ్రులు లోకేష్, బ్రాహ్మణి కూడా దేవాన్ష్ ను ఆనందంతో ముద్దాడారు. ఇక మిగతా కుటుంబసభ్యులు కూడా దేవాన్ష్ కు కేక్ తినిపించారు. ఇలా నారా నందమూరి కుటంబ ఆత్మీయ అనుబంధాలను దేవాన్ష్ వారధిగా మారాడని ఈ సంబరాలను బట్టి అర్థమవుతుంది.