ఏపీలో 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఇవే

Published : Nov 25, 2025, 06:27 PM IST

Andhra Pradesh New Districts: ఆంధ్రప్రదేశ్ లో మూడు కొత్త జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేసే కీలక నిర్ణయంగా దీనిని ప్రభుత్వం పేర్కొంది.

PREV
14
పరిపాలనా సంస్కరణల్లో ఏపీకి కొత్త దిశ.. : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మారుస్తూ, ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక ముందడుగు వేశారు. సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో, జిల్లాల పునర్విభజన, రెవెన్యూ పరిపాలన పునర్‌వ్యవస్థీకరణపై మంత్రుల కమిటీ సమర్పించిన నివేదిక  పై కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు కొత్త జిల్లాల ఏర్పాటు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లకు సీఎం అధికారిక ఆమోదం ప్రకటించారు.

ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరగనుంది. ఇదంతా ప్రజల నుంచి వచ్చిన సూచనలు, స్థానిక అవసరాలు, పెద్దఎత్తున జరిగిన అధికార యంత్రాంగ పరిశీలన ఆధారంగా తీసుకున్న నిర్ణయంగా ప్రభుత్వం పేర్కొంది.

24
మార్కాపురం, మదనపల్లె, పోలవరం: కొత్త జిల్లాలు ఇవే

కొత్త జిల్లాల అవసరంపై గత కొన్ని నెలలుగా ప్రజాప్రతినిధులు, స్థానిక సంఘాలు చేసిన విజ్ఞప్తులను పరిశీలించారు. ఆ అధ్యయనం తర్వాత ప్రభుత్వం మూడు ముఖ్య ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ప్రకటించింది. వాటిలో

• మార్కాపురం జిల్లా

• మదనపల్లె జిల్లా

• పోలవరం జిల్లా (రంపచోడవరం కేంద్రంగా)

ముఖ్యంగా పోలవరం ప్రాంతంలో గిరిజన జనాభా అధికంగా ఉండడం, ముంపు ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధిని వేగవంతం చేయడం, అడవి ప్రాంతాల్లో సేవలను మరింత పెంచడం ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు కారణమైంది. రంపచోడవరం జిల్లా కేంద్రంగా నిర్ణయించడం ద్వారా గిరిజన ప్రాంతాలకు పరిపాలన మరింత చేరువ అవుతుందని అధికారులు అంటున్నారు.

34
ఐదు కొత్త రెవెన్యూ డివిజనలు.. పరిపాలనలో మరో బలమైన అడుగు

జిల్లాలతో పాటు రెవెన్యూ వ్యవస్థలోనూ విస్తరణ అవసరమని మంత్రుల కమిటీ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ప్రకటించారు. వాటిలో

• నక్కపల్లి – అనకాపల్లి జిల్లా

• అద్దంకి – ప్రకాశం జిల్లా

• పీలేరు – మదనపల్లె కొత్త జిల్లా

• బనగానపల్లె – నంద్యాల జిల్లా

• మడకశిర – శ్రీ సత్యసాయి జిల్లా

ఈ డివిజన్లు ఏర్పడడంతో ప్రజా సమస్యలు వేగంగా పరిష్కారం కావడం, సేవలు సమయానికి చేరడం, స్థానిక పరిపాలన బలోపేతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

44
కొత్త మండలాలు, పరిపాలనా పునర్వ్యవస్థీకరణ

సమీక్షలో భాగంగా మండలాల పునర్వ్యవస్థీకరణ పై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్దహరివనం కొత్త మండలంగా ప్రకటించారు. స్థానిక ప్రజలు చాలాకాలంగా ఈ డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి పనులు కేంద్రీకృతం కావాలనే ప్రధాన కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మొత్తం మీద, ఈ మార్పులతో పరిపాలన మరింత సులభంగా, వేగంగా, గ్రామీణ ప్రజలకు చేరువగా మారే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే అధికారిక గెజిట్ విడుదల చేసి, కొత్త జిల్లాల కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది నియామకాలు ప్రారంభించనున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories