Amaravati or Amaravathi : ఏపీ రాజధాని పేరును ఇంగ్లీష్ లో ఎలా రాయాలో తెలుసా..?

Published : Apr 15, 2026, 04:26 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పేరును ఇంగ్లీష్ లో ఎలా రాయాలి…? తాజాగా కూటమి ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. Amaravati or Amaravathi… ఏది కరెక్టో తెలుసా..?  

PREV
15
అమరావతికి చట్టబద్దత..

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రజల్లో చాలా అనుమానాలున్నాయి... అన్నింటిపై క్లారిటీ ఇస్తోంది కూటమి ప్రభుత్వం. గత వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట హడావిడి చేసిన నేపథ్యంలో ప్రజల్లో ఓ కన్ఫ్యూజన్ మొదలయ్యింది. మళ్లీ వైసిపి అధికారంలోకి వస్తే ఎక్కడ రాజధానిని మారుస్తుందో అనే అనుమానాలున్నాయి. దీనిపై క్లారిటీ ఇస్తూ అమరావతికి చట్టబద్దత కల్పించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... పార్లమెంట్ ఆమోదం, గెజిట్ విడుదలతో రాజధాని అమరావతికి చట్టబద్దత లభించింది.

25
అమరావతి పేరుపైనా క్లారిటీ...

ఇలా రాజధాని నిర్మాణంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన కూటమి తాజాగా అమరావతి పేరుపైనా క్లారిటీ ఇచ్చింది. తెలుగులో ఓకే కానీ ఇంగ్లీష్ లో అమరావతి పేరు రాసేటప్పుడు కన్ఫ్యూజన్ ఉంటోంది... దీంతో అధికారిక వ్యవహారాల్లోనే కొన్నిసార్లు Amaravati అని... మరికొన్నిసార్లు Amaravathi అని పేర్కొంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ను తాజాగా ఫుల్ స్టాప్ పెట్టేసింది సర్కారు.

ఇకపై రాజధాని పేరును ఇంగ్లీష్ లో Amaravati అని మాత్రమే పేర్కొనాలని కూటమి ప్రభుత్వం సూచిస్తోంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక ప్రభుత్వం పైళ్లు, జీవోలు, అధికారిక పత్రాల్లో కచ్చితంగా 'Amaravati' అని మాత్రమే పేర్కొనాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఆదేశించారు.

35
అమరావతి నిర్మాణం...

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన అనంతరం హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా మారిపోయింది. ఏపీ నూతన రాజధానిని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విజయవాడ, గుంటూరు సమీపంలో కొత్తగా ఓ నగరాన్నే నిర్మిస్తోంది ప్రభుత్వం... కృష్ణా నది ఒడ్డునగల ఈ నగరానికి దేవతల రాజధాని అమరావతి పేరు పెట్టారు.

రాజధాని అమరావతి నిర్మాణం కోసం 29 గ్రామాలకు చెందిన దాదాపు 28 వేల మంది రైతులు తమ 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది ప్రపంచ చరిత్రలోనే భూసేకరణలో అతిపెద్ద స్వచ్ఛంద ఉద్యమంగా నిలిచింది. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా ఎదగనుందని టిడిపి, జనసేన, బిజెపి నాయకులు చెబుతున్నారు. పర్యాటక రంగంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గుర్తింపును తీసుకువస్తుంది.

45
అమరావతి ఓ నగరం కాదు.. ఐదు నగరాల సమ్మేళనం

ఏపీ నూతన రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు.. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఒక వినూత్న 'పీపుల్స్ క్యాపిటల్'. కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా థీమ్ నగరాలుగా విభజించారు. అవి..

నాలెడ్జ్ సిటీ : విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాల కోసం.

జస్టిస్ సిటీ : హైకోర్టు, న్యాయ సంబంధిత సంస్థల కోసం.

ఫైనాన్షియల్ సిటీ : బ్యాంకింగ్, వాణిజ్య కేంద్రంగా.

హెల్త్ సిటీ : అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రుల కోసం.

గవర్నమెంట్ సిటీ : సచివాలయం, అసెంబ్లీ, రాజ్‌భవన్ కోసం.

55
అమరావతిలో ఐకానిక్ నిర్మాణాలు..

అమరావతిలో కొన్ని నిర్మాణాలు ప్రపంచ స్థాయి ఆకర్షణలుగా నిలవనున్నాయి.

అసెంబ్లీ భవనం : బౌద్ధ స్తూపాన్ని పోలి ఉండే విధంగా, ఆకాశాన్ని తాకే శిఖరంతో దీని డిజైన్ రూపొందించబడింది.

హైకోర్టు : బౌద్ధ చైతన్యాన్ని ప్రతిబింబిస్తూ 'డైమండ్' ఆకారంలో దీనిని డిజైన్ చేశారు.

సెక్రటేరియట్ టవర్స్ : అత్యాధునిక సాంకేతికతతో, గాలి పటాల ఆకారంలో ఎత్తైన భవనాలను నిర్మిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories